పురుషులు, స్త్రీలు ఒకరికొకరు కోరికలు తీర్చేసుకోడంతో, తీవ్ర అనుభూతులు కలిగే అవకాశం నశిస్తోంది. ఎవరికి ఎవరూ ఆకర్షించబడాల్సిన పని లేదు. ఒకరి కొకరు ఆకర్షించుకోడం, అనుభూతి చెందటం, సాంగత్యం కావాలనే వాంఛలను పెంచుకోవడం వంటివన్నీ పుస్తకాలకు,చరిత్రకు పరిమితమై పోతున్నాయి. ఆకర్షించుకోవడమనేది అర్ధంలేని మాటగా మారింది.  జంటలు, లేదా సింగల్స్ అందరూ ఒక ధ్రిల్ పొందేసి, మరో ధ్రిల్ కు సిద్ధంగా వుంటున్నారు. అయిపోయిన క్షణిక ఆనందం బోర్ కొట్టేస్తోంది. యువత చేసే రతిలో నిషేధాలు లేవు.


ఒకరి భార్య మరొకరికి ప్రియురాలు, ఒకరి భర్త మరొకరికి ప్రియుడు. సాధారణంగా ఇదే అంశంతో సాగుతున్నాయి ఏళ్ళ తరబడి ప్రదర్శించే టి.వి. ఛానెళ్ళ సీరియల్ కధలు. ఏ రకమైన తప్పు ఒప్పు అనేది లేకుండా ఒకరి కొకరు అతి తేలికగా రతిక్రీడలాచరించేస్తున్నారు. అందుకు వారికి అడ్డు చెప్పేవారు కూడా లేరు.  దేశంలో జనాభా పెరిగిపోతోంది. అందుకు కారణం సెక్స్. అయితే, సెక్స్ కావాలనే అనుభూతి అంతరించిపోతోంది. నేటిరోజుల్లో శృంగారంలో రహస్యం అంటూ ఏమీ లేదు. నిషేధం అంతకంటే లేదు. ముందుగా రతి చేసేయటం తర్వాత హయిగా కూర్చొని మాట్లాడుకోవడంగా వుంది. కనుక ఇక ఆకర్షణ అనే మాటకే అర్ధం లేదు.  


నేటి రోజుల్లో ముద్దు పూర్తిగా సర్వసాధారణం. అదే పార్టీలలో అయితే, పక్కగదులలో రతి చర్యలే సాగుతున్నాయి. ఇక చేయిపట్టుకుంటే చాలు. ఒళ్ళు జలదరించటంలో వచ్చే అనుభూతి అనేది ఎక్కడుంది? కలిసిన పది లేదా 12 గంటలలో పడక సుఖాలు పంచేసుకోవడమే. నైట్ అవుట్ అనే పదం సామాన్యమైంది. తెల్లవారితే విడిపోయేటందుకు ఇద్దరికి అంగీకారమే. మానసిక అంగీకారాలకంటే ముందు శారీరక ఇష్టాలు చోటుచేసుకుంటున్నాయి.  బ్లూఫిలిం చూడటంలో ఆనందం లేదు. ఫిల్ములో జరిగేలా ప్రవర్తించటానికే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చేస్తున్నారు.


ప్రతిరోజూ ఒక వెరైటీ అది సెక్స్ అయినా సరే, తిండి అయినా సరే. పరిష్కారం - యువత నిగ్రహం కలిగి వుండాలి. వేచి వుండాలి. ఎవరితో పూర్తి జీవిత ఆనందం దొరుకుతుందనేది అవగాహన చేసుకోవాలి. తమను తామే కాక, తమ భాగస్వామిని కూడా అర్ధం చేసుకోవాలి. మానవ మేధస్సు ఒక అద్భుత సృష్టి.  కొద్దిపాటి సమయంలో శరీరానికి రుచులు అందించేస్తుంది. అయితే, వీటిలో భావోద్రేకాలు కూడా కావాలి. అందుకుగాను కొంత వేచి వుండాలి. భాగస్వామి పట్ల అవగాహన కలిగి వుండాలి. జీవితాన్ని అనుభూతి చెంది ఆనందించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: