నాకు ఇంకా సెక్సు కోర్కెలు ఉన్నాయి అన్నవారికి, మా వారికి అంగస్థంభన లేకున్నా సర్థుకుపోతున్న వారికి ఇప్పుడసలే కోరికలు కలగటం లేదు అంటున్నవారికి. గతంలో బాగానే తృప్తి పొంది ఇప్పుడా తృప్తిని పొందలేనివారికి మార్గం వుందంటున్నారు సెక్సు నిపుణులు. సెక్స్ లో చురుకుగా ఏ వయసు లోనైనా సాధ్యమే అంటున్నారు. అయితే శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటున్నారు వైద్యులు. 62 ఏళ్ల వయసు మగవారికి ఆండ్రోపాజ్ ప్రారంభమవుతుంది. 45 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా మగవారిలో ఆ స్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఆ వయసులో సెక్సు హార్మోనులు టెస్టోస్టిరాన్ తగ్గుదల మొదలవుతుంది. ఆ హార్మోన్ సరిగా లేకుంటే సెక్స్ కోర్కెలు కలగవు అంటున్నారు. అయితే ఇవే కాకుండా డయాబెటిస్, కొలెస్టారాల్ స్థాయి అధికం ఇతర అనారోగ్య కారణాల వల్ల కూడా కోర్కెలు తగ్గవచ్చు అంటున్నారు. అంతేకాక మానసికంగా ఆందోళన ప్రభావం ఉంటుంది. పిల్లల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మత్తు పానీయాల అలవాట్ల వల్ల కూడా సెక్స్ సమర్థతను తగ్గిస్తుందని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి మగవారిని వైద్య పరీక్షలు జరిపించి ఏ కారణాల వల్ల అలాంటి మార్పు వచ్చిందో తెలుసుకొని వారిని సరైన సెక్స్ సమర్థతకు తిరిగి తీసుకురావచ్చని సెక్స్ నిపుణులు తెలియజేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: