కుటుంబ నియంత్రణ పద్దతిగా అవలంభిచే ఉపసంహరణపద్దతి వల్ల నరాల సంబంధంగా కానీ, శారీరకంగా కానీ, బలహీనత కలుగుతుందా అనే విషయంపై విశేషంగా పరిశోధనలు జరిగాయి. చివరికి దీనివల్ల ఎటువంటి నరాల బలహీనతలు కలగవని, శారీరక బలహీనతలు ఏర్పడవని నిర్థారించారు. అయితే రతిలో తృప్తి కలిగే విషయంలో కొంతలోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీలలో సుఖప్రాప్తి కలగడానికి కొంతసమయం పడుతుంది. కొన్నిసందర్బాలలో స్త్రీకి సరిగ్గా సుఖప్రాప్తి ప్రారంభమయ్యే సమయానికి పురుషాంగాన్ని రతినుంచి ఉపసంహరించడం జరుగుతుంది. ఇటువంటప్పుడు ఆ స్త్రీకి రతిలో అసంతృప్తి కలగడమో, రతి అంటేనే అసహ్యం కలగడమో జరుగుతుంది. ఇలా కొంతమంది స్త్రీలలో రతియెడల అసంతృప్తి ఏర్పడితే మరికొందరిలో పురుషుడు ఉపసంహారణ చేయకపోతే వీర్యస్ఖలనం జరిగి ఎక్కడ గర్భం వస్తుందో అని భయపడి పోతుంటారు. వారికి సంయోగంలో ఆనందం కంటే ఎక్కువ భయం ఉంటూంటుంది. ఇదే పరిస్థితి కొందరి పురుషులలో కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడ పొరపాటున వీర్యస్ఖలనం అయిపోతుందో ఎక్కడ గర్భం వస్తుందో అనే భయంతో సంయోగంలో సరిగ్గా పాల్గొనలేకపోతారు. ఒక్కొకోసారి ఆ భయం తీవ్రతతో వీర్యస్ఖలనం అయిపోతున్నవారికి అంగ ఉపసంహరణ చేయలేకని మానసిక ఆశక్తస్థితి ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వీర్యస్ఖలనం జరగకముందే పురుషాంగం నుంచి వెలువడే పల్చని ప్రొస్టేట్ ద్రవంలో కొన్ని వీర్యకణాలు ఉండి వాటివల్ల కూడా గర్భం రావచ్చు. అందుకని రతిలో పురుషాంగం ఉపసంహరణ పద్దతి వల్ల గర్బం రాదని ధైర్యంగా ఉండటానికి వీలులేదు. గర్భనిరోధక పద్దతిగా ఇది అవలంభించాలనుకున్నప్పుడు ఫోమ్ బిళ్ళలు కూడా యోని మార్గంలో ఉపయోగించినట్లైతే చాలావరకు రక్షణ ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: