ప్రపంచం వ్యాప్తంగా అనేక యువ జంటల మీద ఒక సంస్థ చేపట్టిన పరిశోధనలో సెక్స్ పట్ల అమితాసక్తి చూపిస్తున్నాయని తేలిందని... రత్రిక్రీడలో ఉన్న మజాను అస్వాదించాలని కలలుకంటారు. కానీ, ప్రియుడు లేదా భర్త మరింత చొరవ తీసుకుని అంగప్రవేశం చేసేందుకు ఉపక్రమిస్తే మాత్రం అయిష్టత చూపుతున్నారని.. దీనికి కారణాలు కూడా తెలుసుకున్నారు నిపుణులు అదేంటంటే కన్యల్లో నెలకొన్న కొన్ని భయాల వల్లే ఈ విధంగా ప్రవర్తిస్తుంటారని సెక్సు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రధానంగా వివాహిత కన్య తొలిసారి సెక్స్‌లో పాల్గొనే సమయంలో తీవ్రమైన ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతుందని వారు అంటారు. ఎందుకంటే... హైమస్ [కన్నెపొర] తొలగిపోయి రక్తం వస్తుందనే భయం వారిని ఎక్కువగా పీడిస్తుందన్నారు. పైపెచ్చు రతిలో నొప్పిని తట్టుకోలేమనే భావన కూడా వారిలో ఉంటుందని అందువల్లే వారు అంగప్రవేశానికి నిరాసక్తత చూపిస్తుంటారని వైద్యులు పేర్కొంటున్నారు. 

అయినప్పటికీ బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. అంగ్రప్రవేశం జరగదు. ఎందుకంటే.. యోని కండరాలు బాగా బిగదీసుకుపోయి ఉండటమే దీనికి కారణమంటున్నారు. మరికొందరు కన్యలు మాత్రం పొత్తికడుపు పైభాగం వరకు ఎంత ముట్టుకున్నా... ముద్దుపెట్టుకున్నా ఆనందానే ఉంటారు. కానీ, చెయ్యి పొత్తికడుపు కింద భాగానికి చేరగానే బిగుసుకుపోతారు. ఇలాంటి స్త్రీలలో యోని కండరాలు వాటంతట అవే బిగుసుకుపోతాయని అంటున్నారు. 

ఇలాంటి సమస్యలతో బాధపడుతూ వివాహమైన కన్యలుగా మిగిలిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని జెనీవాకు చెందిన ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో అమెరికాలో ఈ తరహా కన్యలు ఐదు శాతం ఉన్నట్టు తేలింది. అంతేకాకుండా,  ఇక్కడ మొత్తం 82 జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వగా, ఇందులో ఎక్కువమంది దశాబ్దాలుగా కాపురం చేస్తున్నా.. ఒక్కసారి కూడా రతిలో పాల్గొనలేదని వెల్లడి కావడం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: