దాంపత్య జీవితం సాఫీగా ఉన్నంత వరకు భార్యా భర్తల మధ్య ఎలాంటి గొడవలు రావు. ముఖ్యంగా శృంగారం ఎంత ఉత్సాహంగా చేస్తారో వారు ఎంతో అన్యోన్యంగా ఉండగలుగుతారు. అయితే నిత్యం పనుల ఒత్తిడిలో ఉండి ఇంటికి రాగానే మూడీగా ఉండే మగవారిని మగువలు మూడ్ లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి.. ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే.


ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించే మంత్రమే సెక్స్. అయితే దీన్ని ఎలా ఎప్పుడు ఎక్కడ చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. ఇక మగవారిని మూడ్ లోకి తీసుకు రావాలంటే ముందు వారిని ఆఫీస్, బయట టెన్షన్స్ నుండి రిలాక్స్ అవ్వనిస్తే మంచిది. అప్పుడే రీఫ్రెష్ అయ్యాక శృంగారంలో పాల్గొంటారు. 


ఇక శృంగారం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు వారితో ప్రేమను పంచుకోవడం. అందుకే ముందు భర్తలకు ఇష్టమైన తిను పదార్ధాలను, అల్పా హారాలను చేసి పెట్టాలి. అప్పుడు వారి మంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 


ఇక భార్యలను భర్తలు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ప్రత్యేకమైన దుస్తుల్లో చూడాలని అనుకుంటారు. అలాంటి సమయాల్లో వారి కోరికను నిజం చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా శృంగారంలో ఈ కేటగిరి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.


ఇక భర్త మూడ్ ఆఫ్ లో ఉంటే వారిని తమ మాటల గారడిలో పడేయాలి. వారిలో ఉన్న స్ట్రెస్ అంతా మాటలతో పోగొట్టేయాలి. ఇలా చేయడం వల్ల మాటలు కలిపి మూడ్ ఆఫ్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎన్ని చెప్పినా సరే మూడ్ లోకి రాకుంటే తమ మొదటి పరిచయం ఎలా అయ్యారో గుర్తు చేసుకోవాలి. అరేంజ్డ్ ఆర్ లవ్ మ్యారేజ్ ఇలా మ్యారేజ్ పద్ధతులు ఏవైనా సరే మొదటి పరిచయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ విషయాలను గుర్తు తెచ్చుకుంటే వారి మధ్య చిన్న చిన్న వివాదాలు దూరమవుతాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: