దాంపత్యంలో ఒక్కో జంట ఒక్కో రకమైన అనుభూతిని కోరుకుంటుంది. అది వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. రుతుక్రమంలోనూ కొందరు సెక్స్ ని ఇష్టపడేవారు లేకపోలేదు ఇద్దరికీ ఇబ్భంది లేకుండావుంటే, ఇద్దరూ కావాలని కోరుకుంటే ఆ సమయంలో సెక్స్ నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయవచ్చు.  అయితే ఈ విషయంలో భార్య అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక వేళ ఆమెకి ఇబ్బందిగా ఉంటే ఆ విషయాన్ని, తనకానమయంలో వుండే శారీరకపరమైన అసౌకర్యాన్ని భర్తకి వివరంగా చెప్పాలి. పీరియడ్స్ టైమ్ లో చాలామంది శారీరకంగా ఎంతో కొంత బలహీనంగా వుంటారు. ఆ రోజుల్లో సెక్స్ లో పాల్గొనేంత ఉత్సాహం వారిలో వుండకపోవచ్చు. ఈ విషయాన్ని జీవిత భాగస్వామికి నిస్సంకోచంగా చెప్పాలి. అలాకాకుండా ఇద్దరూ ఇష్టపడినట్లయితే భర్తని కండోమ్ వాడాల్సిందిగా కోరాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ నుండి రక్షణ లభిస్తుంది. ఏదైమైనా బార్యాభర్తల మధ్య ఈ విషయమై పరస్పర అవగాహన అవసరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: