శృంగారానికి మ‌న హెల్త్‌కు ఉన్న లింకులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సుఖ‌వంత‌మైన జీవ‌నానికి ఆరోగ్య‌క‌ర‌మైన శృంగారం కావాల్సిందే. ఈ నానుడి కొన్న వేళ ఏళ్ల నుంచి ఉన్న‌దే. అయితే మాన‌వ జీవితం మారిపోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు శృంగారం విష‌యంలో అశ్ర‌ద్ధ చేసేస్తున్నారు. ఆరోగ్య‌ప‌ర‌మైన శృంగారం క‌ట్టు త‌ప్పుతోంది... కొంద‌రు విచ్చ‌ల‌విడి శృంగారం చేస్తున్నారు. మ‌రికొంద‌రు ఒత్తిళ్ల‌తో శృంగారం చేయ‌లేక‌పోతున్నారు.

ఫ‌లితంగా వివాహేత‌ర సంబంధాలు... దాంప‌త్య జీవితాలు విచ్ఛిన్న‌మ‌వ్వ‌డాలు జ‌రుగుతున్నాయి. ఇక త‌ర‌చూ శృంగారం చేసే వారు చాలా హెల్దీగా - ఫిట్ గా ఉంటారన్నది ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజా అధ్యయనంలోనూ ఇదే అంశం మరోసారి రూడీ అయ్యింది. శృంగారం చేసేవాళ్లు రోగాల‌కు దూరంగా ఉంటార‌ని... అది త‌క్కువుగా చేసేవాళ్లు... శృంగారంపై ఆస‌క్తి లేని వాళ్లు అంతే త్వ‌ర‌గా రోగాల‌కు ద‌గ్గ‌ర‌వుతార‌ని ఆంగ్లీన్ రష్కిన్ వర్సిటీ జరిగిన ఈ పరిశోధన అంశాలను ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ లీ స్మిత్ వెల్లడించారు.

అయితే ఈ ప‌రిశోధ‌న 50 సంవ‌త్స‌రాలు దాటిన స్త్రీ, పురుషుల‌పై జ‌రిగింది.సహజంగా ఎవరైనా 50 ఏళ్లు దాటితే శృంగారంపై అంత ఆసక్తితో ఉండరు. ప‌నిప‌ర‌మైన ఒత్తిడి, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో చాలా మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌రు. ఈ క్ర‌మంలోనే 50 ఏళ్లు దాటిన పురుషులు శృంగారం చేయ‌క‌పోతే వారు రోగాల‌కు గుర‌య్యే ఛాన్స్ మూడింట రెండు వంతులు ఉంటుంద‌ట‌. అదే 50 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు శృంగారంలో పాల్గొన‌క‌పోతే వారికి వ్యాధులు వచ్చే అవకాశాలు ఏకంగా 64 శాతం వరకు ఉంటాయని సర్వే చెప్పింది.

50 ఏళ్లు దాటిన స్త్రీ - పురుషులు సెక్స్ లో పాల్గొంటే వారిలో 85 కాలరీలు కరగిపోతాయట‌. దీంతో ఆటోమేటిక్‌గా చాలా వ్యాయామం వాళ్ల‌కు తెలియ‌కుండానే జ‌రుగుతుంది. ఆ వ‌య‌స్సులో వీరు శృంగారం చేస్తే ఆనందాన్ని కలిగించే ఎండార్పిన్స్ రిలీజ్ అవ్వుతుంది. ఈ అధ్యయనంలో మొత్తం  5700 స్త్రీ - పురుషులపై జరిపిన అధ్యయనం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: