దేశంలో ఎన్ని సంస్కృతులు.. సంప్రదాయాలు ఉన్నాయి.  ఒక్కొక్కరిది ఒక్కో రకమైన సంప్రదాయం.   వారి వారి ప్రాంతాలను బట్టి ఈ సంస్కృతులు ఆధారపడి ఉంటాయి.  అయితే, వీటిని బేస్ చేసుకొని అలవాట్లు ఉంటాయి.  మాములుగా పెళ్లి జరిగిన రోజు సాయంత్రం నవ వధూవరులను శోభనం గదిలోకి పంపుతారు. ఆ తొలిరాత్రి తరువాత వధూవరులు అబ్బాయి ఇంటికి వెళ్తారు.  


అయితే, బెంగాల్  లోని కొన్ని ప్రాంతాల్లో మొదటి రాత్రి జరిగే తీరు వేరుగా ఉంటుంది.  చాలా విచిత్రంగా ఉంటుంది.  పెళ్లి తరువాత వధూవరులు ఇద్దరు అమ్మాయి ఇంట్లో వేరువేరుగా పడుకుంటారు.  ఉదయాన్నే అమ్మాయి తల్లిని చూసి తల్లితో కలిచి గదిలో నుంచి బయటకు వస్తుంది.  ఇది అక్కడి ఆచారం.  ఆ ఆచారం ప్రకారమే అక్కడ అంతా జరుగుతుంది.  ఆచారాన్ని బట్టి అంతా పద్దతి ప్రకారమే జరుగుతుంది.  


అలా మొదటి రాత్రిని అమ్మాయి, అబ్బాయిలు కాళరాత్రిగా జరుపుకుంటారు.  మాములుగా ఎవరికైనా సరే మొదటి రాత్రి అన్నది ఒక అనుభవంగా ఉండాలి.  అద్భుతమైన గుర్తుగా ఉండాలి.  అందమైన అనుభూతులను మిగల్చాలి.  కానీ, బెంగాల్ లో మాత్రం ఆ అనుభూతులు ఉండవు.  అందమైన అనుభవం ఉండదు.  ఉండేదల్లా కేవలం చేదు అనుభవమే.  మొదటి రాత్రి ఎలా జరిగింది అంటే.. పాపం వాళ్ళు ఎం చెప్పాలో తెలియక చాలామంది సైలెంట్ గా ఉండిపోతారట.  


మొదటి రాత్రిని కాళరాత్రిగా జరుపుకుంటే.. వారి జీవితం అంతాకూడా అద్భుతంగా ఉంటుందని, అందమైన జీవితాన్ని అశ్వాదించవచ్చని అంటున్నారు.  ఇలా ఎందుకు జరుపుకుంటారు అంటే.. దానికి పురాణాల్లో ఓ కథ ఉందని, శివ పురాణంలో బెహులా అనే మతప్రవక్త ఉండేది. ఆమె తన చిననాటి స్నేహితుడైన లఖిందర్‌ను ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలంటే.. వారిద్దరి జాతకాలు కలవలేదు. పైగా, లఖిందర్‌కు సర్ప గండం ఉన్నట్లు తెలిసింది. అయితే, ఇద్దరూ దైవ సంభూతులనే కారణంతో పెద్దలు వారికి పెళ్లి చేశారు. ఇద్దరికీ తొలిరాత్రి ఏర్పాట్లు చేస్తుండగా.. లిఖిందర్‌ పాము కాటుతో మరణిస్తాడు. దీంతో ఆ రాత్రికి ‘కాళరాత్రి’ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి అక్కడ అలానే జరుపుకుంటున్నారని, అలా జరుపుకోవడం వలన మిగతా జీవితం అంతా హ్యాపీగా ఉంటుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: