ప్లాస్టిక్ సర్జరీవల్ల, ఉపయోగం లేదు సరికదా, అనేక రకాల ఇబ్బందులు వున్నాయని తేలిపోయింది. మరి స్థనాలను పెద్దవవిగా చేసుకవటానికి, సహజమైన విధానంలో, వ్యాయామాలు ఏమైనా ఉన్నాయా ?అని పలవురు స్త్రీలు తరచూ సైకాలజీస్టులను అడుగుతున్నారు. సరిగ్గా చెప్పాలంటే, స్తనాలను పెంచుకోవడం కోసం, ఎట్లాంటి వ్యాయామాలు లేవు. ఎందుకంటే స్తనాలు కండరాలుకావు.. మీరు వ్యాయామాలు చేసినవెంటనే అవి అనంతంగా పెరగవు. మీరు సహజంగానే కొంతబరువు పెరిగితే. దాంతోపాటే, మీస్తనాలు కూడా పెరుగుతాయి. స్తనాలలో కొవ్వువుంటుంది. కాబట్టి అదనపు కొవ్వుకణాలు ఇక్కడ వచ్చిచేరుతాయి. అయితే ఈ ఎదుగుదల, మీరు ఎదురుచూసినంత స్థాయిలో మాత్రం వుండదు. అంచేత ఇక వున్న మార్గం ఒకటే, ఈస్ట్రోజెన్ హార్మోను తీసుకోవడం( గర్భనిరోధక మాత్రల్లో కూడా ఈ హర్మోన్ వుంటుంది.) కాగా ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకోవడం ద్వారావచ్చే స్తనాలు నొప్పిని కల్గిస్తాయి. అంతేకాదు. మొత్తంమీద మీరు ఒక 5 కేజిల దాకా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ స్తనాలు పైకి ఉబికేలా చేస్తుంది. సహజంగా నాజూకు, సున్నితంగా వుండే అవయావాలు కావడం వల్ల ఈ ఉబకడం కొంత నొప్పిని కల్గిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, స్తనాలు బిగా పెద్దవిగా వుండాలని తపన పడడంవ లన ప్రయోజనాలు బాగా తక్కువ అనే చెప్పాలి. స్తనాలు తగినంత పరిమాణంలో వున్న యువతులు, ఆధునిక దుస్తుల్లో చక్కగా, నాజుకుగా అందంగా కన్పిస్తారు. ఈ విషయంలో యుక్తవయసులో వున్న అమ్మాయిలకు బాగా తెలసు చిన్న స్తానాలు ఎంతో సౌకర్యవంతంగా వుంటాయని, ఏ రకపు దుస్తులు వేసుకున్నా చక్కగా కన్పిస్తాయని అంతేకాదు. చిన్న స్తనాలు గల యువతులు, బ్రా వేసుకోనవసరం లేకుండానే ఫ్రీగా వుండగలుగుతారు. వేసవి వేడిమిఎక్కువగా వుండే దేశం కాబట్టి లోపల ఇబ్బందిని కల్గించే బ్రాలు వేసుకోకుండా, వుండగలిగే అవకాశం లభించడం మంచిదే కధా ! కాబట్టి యువతుల్లారా ,స్తనాల పెంపుకోసం, బాధపడుతూ మీకు గల సౌకర్యాలను వదులుకోకండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: