సెక్స్ తో శారీరక ప్రయోజనాలు సెక్సుతో ఆరోగ్యం అనే అంశంపై పరిశోధన చేసి పుస్తకాలు వ్రాసిన పిహెచ్డీ డాక్టరు శ్రీమతి బార్బరా కీస్ లింగ్ తన అనుభవాలను వివరిస్తూ, తన క్లైంట్లలలో చాలామందికి లైంగిక స్పర్శ ద్వారా, అల్సర్లు, ఆస్నాలు వంటి అనేక శారీరక రుగ్మతలు నయమైనాయని అంటుంది. వారంతా ఈ లైంగిక స్పర్శ యెక్క ప్రాధాన్యతను తెలుసుకుని, ఆమె చెప్పిన సలహాల మేరకు కొన్ని వ్యాయామాలను అనసరించడం ద్వారా ఈ రుగ్మతలను జయించడం జరిగింది. లైంగిక క్రియను ఒక నిర్ణీత దృక్ఫథంలో గనుక వీక్షీంచినట్లయితే ఇందులో శరీరక అంతర్భాగాల, అవయవ వ్యవస్థల సంయుక్త కదలికలను కలిగిస్తుంది. ముఖ్యంగా మీ శ్వాసక్రియ, రక్త ప్రసరణ విషయంలో ఉత్సాహవంతమైన చైతన్యాన్ని కలిగిస్తుంది. మైధునంలో పాల్గొన్నపుడు. మీరు కదిలే కదలికల వల్ల మీ శ్వాసక్రియ వేగాన్ని పుంజుకుంటుంది. ఫలితంగా మీరు మామూలు స్థాయి కన్నా ఎక్కువగాలిని మనం పీల్చుకోలుగుతున్నామో, అందుకు తగిట్లుగానే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ని స్వీకరిస్తాం. ఈ విధంగా ‘ సెక్స్ ’’ వల్ల మీ శ్వాసక్రియ మరింత గాఢంగా జరగడమే కాకుండా ఆక్సిజన్ సరఫరా ఎక్కువవుతుంది. ఫలితంగా రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ చేరి, మీ కణధాతువులను పౌష్ఠికం చేస్తాయి. మీరు లైంగిక కార్యంలో వున్నపుడు, మీ జననాంగాగలకు ఎక్కువ మొత్తంలో రక్తం సరఫరా అవుతుంది. అందువల్లే మీకు లైంగికోత్తేజం ఎక్కువ కావడం, పురుషులలో అంగం భాగా గట్టిపడడం, స్త్రీలలో అయితే యోని పై పెదవులు, లోపలి పెదవులు, యోని శీర్షం రక్త ప్రసరణం వల్ల అక్కడి కణ ధాతువులు బాగా విస్తరించి బోడిపెల్లా మారడం జరుగుతుంది. అంగానికి తగిన పరిమాణంలో యోని విస్తరించడం. లైంగిక క్రియకు కావల్సిన తేమను కలిగించడం జరుగుతాయి. మీ లైంగికోద్రేకం తారాస్థాయికి చేరుకున్నపుడు, మీ రక్త ప్రసరణ ఇంచుమించుగా మీ శరీరమంతటా విస్తరింస్తుంది. ముఖ్యంగా మీ చర్మంపైన, చేతుల కాళ్ళ కండరాలలు రక్తం బాగా ప్రసరిస్తుంది. మీ గుండె చురుకుగా కొట్టుకుంటుంది. నిద్రావస్థలో వున్న మీ శారీరక యంత్రాంగం పూర్తిస్థాయిలో క్రమబద్దంగా పని చేయడం జరుగుతుంది. ఈ రకంగా మీ శరీరమంతటా విస్తృతస్థాయిలో రక్త ప్రసరణ జరిగి, ఎక్కడైనా స్థబ్ధత వుంటే దానిని చెదరగొట్టడం జరుగుతుంది. మడం నొప్పులు, తొడలు లాగడం, పిక్కలు టెన్షన్ తో బిగుసుకుపోవడం, భుజాలు లాగడం వంటి అనేక సమస్యలు వాటంతట అవే సర్ధుకుంటాయి. మీ అలసట అంతా చేత్తో తీసినట్లు పోతుంది. ఒళ్ళంతా బాగా చెమటలు పట్టి అదనపు కొవ్వు నిల్వలు, అనవసరపు లవణాలు బయటకు విడుదలవుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: