స్టార్ సినిమా అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఒకప్పుడు అంటే రొటీన్ ఫార్ములాతో సినిమాలు వచ్చేవి కాని ఇప్పుడు స్టార్స్ కూడా కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తున్నారు. మారిన ప్రేక్షకుల ఆలోచన ధోరణిని బట్టి తాము కూడా మారాల్సిందే అన్నట్టుగా స్టార్ సినిమాల సెలక్షన్ ఉంది. అంతా బాగానే ఉంది కాని బడ్జెట్ విషయంలోనే అసలు కంట్రోల్ లేకుండా పోతుందని తెలుస్తుంది. 

 

ఒక సినిమాకు 70 కోట్లు బడ్జెట్ పెడితే తర్వాత సినిమాకు 90 నుండి 100 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే అంటున్నారు. స్టార్ సినిమా కాబట్టి నిర్మాతలు కూడా అందుకు ఓకే చెబుతున్నారు. అయితే అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేని కథలకు కూడా కోట్లు గుమ్మరిస్తున్నారు. ఫారిన్లో పాటలు.. రిచ్ లొకేషన్స్ సినిమాకు అవసరం లేని వాటికి బడ్జెట్ కేటాయించి నిర్మాతల జేబులు ఖాళీ చేయిస్తున్నారు.

 

అంతేకాదు స్టార్ సినిమా అంటే యాక్షన్ సీన్స్ భారీగా ఉండాల్సిందే. వాటికి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ భారీగా పెట్టేస్తున్నారు. అంతేకాదు సినిమాకు కావాల్సిన సెట్లకు బడ్జెట్ లో 20 శాతం కేటాయిస్తున్నారు. సినిమాను 100 నుండి 150 కోట్లు పెట్టి తీసిన నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ కు ఔట్ రైట్ గా అమ్ముతున్నాడు. సినిమా హిట్టై అంతకు అంత వసూళు చేస్తే ఓకే కాని ఫ్లాప్ అయితే మాత్రం సగం కూడా తీసుకురాలేని పరిస్థితి.

 

కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు.. డబ్బులు పెట్టే నిర్మాతలు బాగుంటున్నారు కాని మధ్యలో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడుతున్నారు. ఈమధ్య సినిమా పూర్తిగా లాస్ అయితే నిర్మాతలు, హీరోలు కొంత రిటర్న్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్, ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ వస్తేనే కాదు సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాలు సాధిస్తేనే ఆ సినిమా అసలైన హిట్ అయినట్టు లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: