ఓ పక్క ప్రపంచ సినిమాను ఆశ్చర్యపరచేలా తెలుగు సినిమా ప్రస్థానం సాగుతుంది. బాహుబలి సినిమాతో ఇది తెలుగు సినిమా స్టామినా అని ప్రూవ్ చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇన్నాళ్లు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అని మాత్రమే గుర్తుండే ప్రపంచ సిని ప్రియులకు తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. అయితే ఓ పక్క తెలుగు సినిమా రేంజ్ పెంచేలా కొందరు ప్రయత్నిస్తుంటే మరికొంతమంది దర్శకులు మాత్రం తెలుగు సినిమా స్థాయిని దిగార్చుతున్నారు. ముఖ్యంగా ఈమధ్య తెలుగు సినిమాల్లో బూతు సినిమాల హంగామా ఎక్కువైందని చెప్పొచ్చు.

 

సినిమా నిండా లిప్ లాకులు, బోల్డ్ సీన్స్ తో నింపేసి చివరన ఓ మెసేజ్ ఇచ్చేస్తున్నారు. ఇదివరకు వీటిని బీ గ్రేడ్ సినిమాలని అనేవారు.. వాటినే ఇప్పుడు అడల్ట్ కామెడీ అని చెబుతూ బూతు సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇలాంటి సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. అందుకే ఈ ఇయర్ కూడా నెలకో అలాంటి సినిమా ప్లాన్ చేశారు. ఇలాంటి సినిమాల్లో కథ, కథనాల కన్నా బెడ్ రూం సీన్స్, లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ముందుగా రిలీజ్ చేసే టీజర్, ట్రైలర్ లోనే సినిమాలోని అన్ని సీన్స్ చూపించేస్తారు.

 

ఇక అలాంటి సీన్స్ ట్రైలర్ లో పెడితే శృంగార ప్రియులు ఊరుకుంటారా చెప్పండి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసి మరి సినిమా చూస్తున్నారు. అడల్ట్ కంటెంట్ సినిమాలు సినిమాలు కావా వారు కూడా సినిమానే కదా తీసేదని అడగొచ్చు.. కరెక్టే కాని ఇలాంటి సినిమాలు తీసి జనాలను పాడు చేయడం కన్నా మంచి సినిమాలు తీయడం బెటర్ అని కొందరి మాట. ఏది ఏమైనా బాలీవుడ్ కు ధీటుగా మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో అడల్ట్ కంటెంట్ సినిమాలు ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: