స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు అయితే వీరి ఎక్సైట్ మెంట్ నే క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు నిర్మాతలు. స్టార్ సినిమాలు సరిగ్గా పండగ టైం లో రిలీజ్ అవుతాయి. పండగ వచ్చిన తర్వాత వచ్చే వీకెండ్ లో కలక్షన్స్ కుమ్మేస్తాయి. అయితే వాటిని మరింత పెంచేందుకు నిర్మాతలు టికెట్టు రేట్లను పెంచుతారు. సినిమాల్లో ప్రజల గురించి భారీ డైలాగులు కొట్టే హీరోలు.. తమ సినిమా విషయంలో టికెట్టు రేటు పెంచితే మాత్రం నోరు మెదపరు. 

 

ఈ సంక్రాంతికి రాబోతున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. నందమూరి కళ్యాణ్ ఎంత మంచివాడవురా సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాల టికెట్లు రేట్లు ఇప్పటికే పెంచారు. స్టార్ సినిమా బడ్జెట్ రేంజ్ ను పెంచి ఆ భారాన్ని ప్రేక్షకుల మీద వేస్తున్నారు. సిటీలలో ఈ పరిస్థితి ఎలా ఉందో కాని సింగిల్ స్క్రీన్ సెంటర్స్ లో మాత్రం 100 రూపాయల టికెట్ ను 110 రూపాయలు చేశారు. అంటే సాధరణంగా సినిమాకి 100 రూపాయలు చార్జ్ ఉంటుంది. అయితే ఇప్పుడు దానికి మరో 10 లేదా 20 కలిపి అమ్ముతున్నారు. 

 

స్టార్ సినిమా అని చంకలు గుద్దుకుంటూ వెళ్లడమే తప్ప. అభిమానుకే జేబులు చిల్లులు పడుతున్నాయి. స్టార్ సినిమాకు అనవసర బడ్జెట్ ఎందుకు పెట్టాలి.. మళ్లీ ఇలా టికెట్ రేటు ఎందుకు పెంచాలని అంటున్నారు కొందరు సిని విశ్లేషకులు. సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాల టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఆల్రెడీ టికెట్లు బుకింగ్స్ కూడా భారీగా ఉన్నాయి. మరి జేబులకు చిల్లులు పడినా సరే స్టార్ సినిమా అంటే తమ వంతు కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే అని ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. మరి ఈ టికెట్ల రేట్ల విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇక మీదట అలా టికెట్లు రేట్లు పెంచకుండా చూడాలని కొందరు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: