ఒక సినిమా ఆడాలంటే ఏయే అంశాలు ఉండాలన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.. కొన్ని సినిమాలు ఎందుకు ఆడలేదో తెలియవు.. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయో అర్ధం కావు. థియేటర్ కు వచ్చిన ఆడియెన్ ను ఆ రెండు గంటల పాటు మెప్పిస్తే చాలు సినిమా హిట్ అన్నట్టే. అయితే ఇంత చిన్న లాజిక్ తెలియకుండానే దర్శకులు సినిమాలు చేస్తున్నారా అంటే.. వాళ్లకి లాజిక్ తెలుసు కాని ఆ లాజిక్ ని వాడుకునే మ్యాజిక్ మిస్ అవుతున్నారు. స్టార్ సినిమా అయినా యువ హీరో సినిమా అయినా అసలు ఎలాంటి సినిమా అనుభవం లేని వారితో తీసిన సినిమా అయినా బొమ్మ హిట్టు పడాలి అంటే ప్రేక్షకుడు మనసు గెలవాలి.

 

అందులో చాలా రకాల మాయలు మంత్రాలు ఉంటాయి. కంటెంట్ స్ట్రాంగ్ తో వచ్చే సినిమాలకు కొద్దిగా మేకింగ్ యాడ్ చేస్తే చాలు ఆ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఎందుకంటే సినిమాను ఆడించేది కంటెంటే.. అయితే కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా తీయడం సరిగా లేకపోతే మాత్రం ఆశించిన స్థాయిలో ఆడవు. అయితే ఎలాంటి కంటెంట్ లేకుండా ఆడే సినిమాలు ఉంటాయి. రొటీన్ కథ చెప్పినా ప్రేక్షకుడికి చెప్పే కథ మీద కాకుండా చూపించే కథనం మీద దృష్టి మళ్లిస్తే సినిమా హిట్టు పడ్డట్టే.

 

ఇలా చేతుల్లో మంత్ర దండాలు లేకుండా మాయ చేసే దర్శకులు తెలుగులో కూడా ఉన్నారు. అయితే వీటిలో మాటలతో మాయచేసే వారు కొందరైతే.. కామెడీతో మాయ చేసే వారు మరికొందరు. జానర్ ఏదైనా.. బ్యాక్ డ్రాప్ ఏదైనా రెండు గంటల సినిమా ప్రేక్షకుడితో పాటుగా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చాలు ఆ సిన్సియర్ ఎఫర్ట్ కు ప్రేక్షకులు సైతం తమ ఓటు వేస్తారు. కొన్ని సినిమాలు ఎలాంటి కొత్తదనం లేకున్నా సరే బాగుంది అనిపించుకుంటాయి. ఆ దర్శకులు పాటించే సూత్రం ఇదే.. ఫైనల్ గా ఒక సినిమా ప్రేక్షకుడి మెప్పు పొందాలంటే మాత్రం మ్యాజి.. మ్యూజిక్.. లాజిక్ మూడు తప్పనిసరి అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: