ఈమధ్య టాలీవుడ్ లో హీరోలు కొందరు తమ సినిమాలకు తామే కథలు రాసుకుంటామని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో హీరో గారు అలా చేసిన మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమా కథ కూడా ఆయన రాసిందే.. తర్వాత ఆ హీరో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. ఈమధ్య కూడా అతను చేసిన ఒక సినిమా టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచగా సినిమా మాత్రం నిరాశ పరచింది. సంక్రాంతి సినిమాల సందడి తర్వాత రిలీజైన ఈ సినిమా వర్క్ అవుట్ కాలేదు. 

 

రిలీజ్ ముందు బాగానే హడావిడి చేసిన ఈ మూవీ రిలీజ్ తర్వాత వసూళ్లు సరిగా రాబట్టలేదు. ఈ సినిమాకు హీరోనే కథ అందించడం విశేషం. ఇదివరకు తనతో పనిచేసిన దర్శకుడి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ హీరోసినిమా విషయంలో ఎవరిని తప్పు పట్టడానికి లేదు.   అంతేకాదు తను చేసే ప్రతి సినిమాలో ఎవరితో అయినా గొడవపడే హీరోసినిమా ఫెయిల్యూర్ కు కారణాలు వెతుకుతున్నాడట. 

 

ప్రస్తుత సినిమా కూడా అతని సొంత బ్యానర్ లో తెరకెక్కింది. కథ అతనిదే.. బ్యానర్ కూడా వాళ్లదే కాబట్టి తనకు ఇష్టం వచ్చినట్టుగా హీరో చేశాడట. ఈ మూవీ అతని 3 నుండి 5 కోట్ల దాకా లాస్ తెచ్చినట్టు తెలుస్తుంది. ఇక మీదట ఆ హీరో సొంత కథలు రాయకూడదని డిసైడ్ అయ్యాడట. అంతేకాదు ఆ ప్రొడక్షన్ కూడా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తుందట. బయట రెండు సినిమాలు చేసి ఆ వచ్చిన మొత్తంతో సొంతంగా సినిమా చేస్తే అది కాస్త నిరాశ పరుస్తుందని ఇక మీదట కొన్నాళ్ళు పూర్తిగా బయట సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు సదరు హీరో. మరి హీరో గారి ఈ నిర్ణయం అతనికి ఇకమీదట మంచి ఫలితాలు ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: