టాలీవుడ్ లో ఏ సినిమా ఎప్పుడు ఆగిపోతుందో.. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి అయ్యింది. స్టార్ హీరోల సినిమాలు ఎలా ఉన్నా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఫీమేల్ లీడ్ మూవీ చేసిన స్టార్ హీరోయిన్ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలియని పరిస్థితి వచ్చింది. నూతన దర్శకుడు డైరెక్ట్ చేసిన ఆ సినిమాను అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ పెట్టి తీశారట. ఇప్పుడు రిలీజ్ టైం కు కావాల్సిన బడ్జెట్ లేక రిలీజ్ ఆపేశారని తెలుస్తుంది.

 

ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఆ తర్వాత మాత్రం సినిమాకు ఏమాత్రం బజ్ లేకుండా పోయింది. అంతేకాదు జనవరిలోనే రిలీజ్ అనగా అప్పటికి సినిమా బిజినెస్ కాలేదని రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. సినిమాపై ఎలాంటి వార్తలు లేకపోవడంతో సినిమా బిజినెస్ పై ప్రభావితం పడ్డది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా తన సినిమా గురించి ప్రమోట్ చేయలేదు కానీ ఓ యువ హీరో నిర్మాతగా మారి చేసిన సినిమా ఈవెంట్ లో తళుక్కున మెరిసింది. తన సినిమా గురించి పట్టించుకోవడం మానేసింది.

 

లీడింగ్ యాక్ట్రెస్ అందులో కోలీవుడ్ హీరో కూడా నటించగా సినిమా గురించి అటు ఇటుగా ఉన్నారు. దర్శకుడు కొత్త అతను కాబట్టి సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇక నిర్మాత ఒక సీనియర్ రైటర్ కాబట్టి అతను తన సర్కిల్ తో సినిమాను బయటకు తీసుకు రావాలని చూస్తున్నాడు. మరి ఇంతకీ ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు.. ఆ హీరోయిన్ సినిమాపై ఈ కన్ ఫ్యూజన్ ఏంటి.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ సినిమా అసలు వస్తుందా రాదా అన్నది కూడా డైలమాలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: