ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. మొన్నటిదాకా రష్యన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో బాగా ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు అతని నుండి విడిపోయి సింగిల్ గా ఉంటుంది. ఆండ్రూని పెళ్లి చేసుకోవడమే లేటు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి. అతనితో ఫుల్ ఎంజాయ్ చేసిన ఇలియానా ఇప్పుడు సోలోగా ఉంటూ మళ్లీ సినిమాలు చేయాలని చూస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫాం లో ఉన్న టైంలో బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకి చెక్కేసింది.    

 

బర్ఫి సినిమాతో ఎంట్రీ బాగానే దొరికినా ఆ తర్వాత ఇలియానాని పట్టించుకోలేదు. అడపాదడపా సినిమాలైతే చేస్తుంది కాని ఆశించిన స్థాయిలో అయితే లేదు. అందుకే తనకు స్టార్ క్రేజ్ తెచ్చిన సౌత్ సినిమాలపై కన్నేసింది. రెండేళ్ల క్రితం అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానాసినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ వెనుకపడ్డది. తెలుగులో స్టార్స్ అందరితో నటించిన ఇల్లి బేబ్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది.

 

మంచి ఫాం లో ఉన్నప్పుడు ఇక్కడ ఆఫర్లు కాదన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు లేక తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు బికిని ఫోటోలతో అలరిస్తుంది. ఫాం లో ఉన్న హీరోయిన్స్ మాత్రమే కాదు ఒకప్పుడు ఆడియెన్స్ ను అలరించిన తారలు కూడా ఈమధ్య ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇలియానా కూడా బికిని అందాలతో పిచ్చెక్కించేస్తుంది. సినిమాలో గ్లామర్ షో చేయడం వేరు ఇలా రియల్ లైఫ్ లో రెచ్చిపోవడం వేరు.. మరి ఇలియానా ఇంత చేస్తున్నా అవకాశాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇలియానా బికినీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గుతుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: