ప్రతి శుక్రవారం టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. స్టార్ సినిమా అయితే ఆ హంగామా వేరేలా ఉంటుంది. అదే చిన్న సినిమా అయితే ఏదో ఒక స్పెషల్ ఉంటే తప్ప ఓపెనింగ్స్ కష్టం. అయితే ఈమధ్య చాలా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని గొడవ చేస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలతో తెరకెక్కించే సినిమాలు రిలీజ్ టైం కు థియేటర్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. సమస్య ఉంది అని తెలిసి ఒకరిద్దరు నష్టపోయిన నిర్మాతలు గొంతు విప్పి మాట్లాడినా వాళ్ళని కంట్రోల్ చేయిస్తున్నారు. 

 

చాలా సీరియస్ మ్యాటర్ అయిన ఈ విషయంపై ప్రస్తుతం సినీ పరిశ్రమ పెద్దగా ఉంటున్న చిరు ప్రస్తావించడం విశేషం. నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ హీరోగా నటించిన ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు చిన్న సినిమాల థియేటర్ సమస్యపై మాట్లాడారు. పంపిణిదారులు చిన్న సినిమాల రిలీజ్ కు సహకరించాలని కోరారు. మాములుగా తెలుగు రాష్టాల్లో  థియేటర్ లు అన్ని కేవలం నలుగురు దగ్గరే ఉన్నాయన్న కామెంట్స్ వింటూనే ఉంటాం. చిన్న సినిమాలైనా సరే వారికి అమ్మినవి గాని లేదా వారి సమర్పణలో వచ్చినవి గాని అయ్యుంటే తప్ప అంత ఈజీగా థియేటర్లు దొరకనివ్వరు. 

 

అయితే చిరు లాంటి హీరో సినీ పెద్దగా డిస్ట్రిబ్యూటర్లని చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయమని చెప్పడం హాట్ న్యూస్ గా మారింది. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు లాభాలు వస్తే పరిశ్రమ ఇంకా బాగుంటుందని చిరు ఆలోచన. మరి చిరంజీవి చెప్పిన ఈ మాటని ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి. మార్పు వస్తే కనుక చిరు చిన్న సినిమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. మరి చిరు మాట లైట్ తీసుకుంటారా లేక సీరియస్ గా తీసుకుని చిన్న సినిమాలకు అండగా ఉంటారా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: