డైరక్టర్ గా సూపర్ హిట్లు కొడుతున్నా ఆ కిక్ సరిపోని సుకుమార్ నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు. అయితే నిర్మాతగా తను చేసే సినిమాలకు తనే కథలు అందించడం విశేషం. అలా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా కుమారి 21f. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ గా ఉండదు కాని ఆయన నిర్మించిన సినిమాల్లో మాత్రం హీరోయిన్ రెచ్చిపోతుంది. కంటెంట్ అలా ఉంటే ఏం చేస్తాం అనుకోవచ్చు.

 

ఇక ఇదిలాఉంటే సుకుమార్ నిర్మించిన రెండో సినిమా దర్శకుడు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతగా సైలెంట్ అయ్యాడు సుక్కు. అయితే ఇప్పుడు మళ్ళీ తన నిర్మాణంలో ఈసారి గీతా ఆర్ట్స్ సహకారంతో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు సుకుమార్. యువ హీరో నిఖిల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఈరోజు ముహూర్తం పెట్టుకున్నారు. సుకుమార్ 21f సెంటిమెంట్ తోనే 18 పేజెస్ అని టైటిల్ పెట్టినట్టు ఉన్నాడు. అయితే ఈ 18 ప్రేజెస్ లవ్ స్టోరీలో సుకుమార్ ఇంకెన్ని కుమారి 21f లను చూపిస్తాడో అని ప్రేక్షకులు ఎక్సయిట్ అవుతున్నారు. 

 

సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలే కాదు నిర్మించిన సినిమాల్లో కూడా మ్యాటర్ ఉంటుంది. అందుకే నిఖిల్ 18 పేజెస్ మీద టైటిల్ ఎనౌన్స్ చేయగానే ఒ పాజిటివ్ బజ్ వచ్చింది. ఈమధ్యనే ఎంగేజ్ మెంట్ జరుపుని లైఫ్ లో కొత్త స్టెప్ వేసిన నిఖిల్ కు ఒ పక్క కార్తికేయ 2 సినిమా.. మరోపక్క సుకుమార్ మూవీ చూస్తుంటే మనోడికి తన భార్య చాలా లక్కీ అయ్యేలా ఉంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే మాత్రం నిఖిల్ ఫేట్ మారే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: