త‌రుచూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ప‌తాక శీర్షిక‌ల్లోకి ఎక్క‌డం, ఆ త‌ర్వాత అంద‌రి ముందు అభాసుపాల‌వ‌డం మ‌నుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి అల‌వాటే..  గ‌తంలో అనేక సార్లు సొంత పార్టీపైనే ఆరోపణ‌లు చేసి నేత‌ల‌తో చీవాట్లు తిన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని.. గాంధీ భ‌వ‌న్‌లో మీటింగ్‌లు పెడితే పార్టీ అధికారంలోకి రాద‌ని సెల‌విచ్చారు కూడా..  కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు చేసుకుని, క‌మ‌లం గూటికి చేరాల‌ని తెగ ఉబ‌లా ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అధిష్టానం రెండు సార్లు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. మ‌రోప‌క్క రాజ‌గోపాల్‌రెడ్డి నోరు అదుపులో పె ట్టుకోవాల‌ని, పార్టీ మారితే త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని రాష్ట్ర నేత‌లు కూడా ఎమ్మెల్యేకు గట్టి వార్నింగ్ ఇవ్వ‌డంతో కొంత‌కాలం సైలెంట్ అయ్యారు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చారు.. త్వ‌ర‌లోనే తాను బీజేపీలో చేరుతాన‌ని, రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లోపాటు పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని కూడా తానేన‌ని రాజ‌గోపాల్‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి, త‌న అనుచ‌రుల వ‌ద్ద తెగ ఫోజులు కొట్టాడు. ఈ విష‌యం కాస్తా.. బీజేపీ నేత‌ల వ‌ర‌కు చేర‌డంతో రాజ‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. పార్టీలో చేర‌క‌ ముందే ఇలాంటి వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ఏంట‌ని, ఇలాంటి నేత‌లను చేర్చుకుంటే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని రాజ‌గోపాల్‌రెడ్డిపై ఏకంగా  ఢిల్లీపెద్ద‌ల‌కు ఫిర్యాదు చేశారు.  దీంతో  సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది.. నేత‌ల అ భిప్రాయాల‌ను గౌర‌వించి రాజ‌గోపాల్‌రెడ్డిని త‌మ పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ పెద్ద‌లు నిరాక‌రించారు. దీంతో ఇక విధిలేని ప‌రిస్థితుల్లో రాజ గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే త‌ప్ప‌క కొన‌సాగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ ప‌రిణామాలతో ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తోపాటు నాయ‌కులు, శ్రేణులు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఆయ‌న ఏం మాట్లాడినా  తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీలో అడ్డం పొడుగు మాట్లాడినా ఎవరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్య‌మంత్రిని స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తున్నా... సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంలేద‌ని రాజ‌గోపాల్‌రెడ్డి తెగ మ‌ద‌నప‌డుతున్నార‌ట‌.. అటు బీజేపీ వాళ్లు ద‌గ్గ‌ర‌కు రా నీయ‌క‌పోవ‌డాన్నే అవ‌మానంగా భావించిన ఆయ‌న .. ఇటీవ‌ల సొంత పార్టీలో త‌న‌కు జ‌రుగుతున్న అవమానాల‌ను త‌లుచుకుని ఫీల‌వుతున్నార‌ట‌..    

మరింత సమాచారం తెలుసుకోండి: