రాష్ట్రంలో కామ్రెడ్లు మ‌రీ ఇంత దిగ‌జారుతారా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అంద‌రి నోళ్ల నుంచి వినిపిస్తోంది. పావ లా ప‌నికి ముప్పావ‌లా యాక్ష‌న్ చేస్తున్నారంటూ.. క‌మ్యూనిస్టు పార్టీ నేత‌ల‌పై ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ దూకుడు ప్ర‌జ‌ల‌కు మంచి చేసే ప‌నుల‌పై పెడితే ఎన్నిక‌ల్లో ఓట్ల‌యినా ద‌క్కుతాయి క‌దా? అంటూ ప్ర‌శ్ని స్తున్నారు. ఇంత‌కీ క‌మ్యూనిస్టులు ఏం చేశారు?  ప్ర‌జ‌లకు ఎందుకు ఇంత కోపం వ‌చ్చింది? అనే విష‌యం చూద్దాం. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ త‌న‌కు భ‌ద్ర‌త త‌గ్గింద‌ని ఆప‌శోపాలు ప‌డుతూ.. నేరుగా కేంద్రానికే లేఖ సంధించారు. ఈ విష‌యం రాజ‌కీయ రంగు పులుముకుంది.



దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న క‌మ్యూనిస్టులు.. దీనిపై పావ‌లాకు బ‌దులుగా ముప్పావ‌లా యాక్షన్ చేస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ జాతీయ నేతలు హ‌ద్దు మీరి మ‌రీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సీఎం జగన్‌ అత్యంత మూర్ఖపు చక్రవర్తి. ఆయనది ప్యాక్షనిస్టుల ప్రభుత్వం. అంతా క్రిమినల్‌ గ్యాంగ్‌. నిమ్మగడ్డను లారీతో గుద్ది చంపేసినా ఆశ్చర్యం లేదు’’ అని చికెన్ నారాయ‌ణ చెప్పుకొచ్చారు. ఆంధ్ర ఎస్‌ఈసీకి కేంద్రం భద్రత కల్పించాలంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా నేరుగా అమిత్‌ షాకు లేఖ రాశారు.



రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించడానికి వీలు లేకుండా, భయానక పరిస్థితులు ఏర్పడడానికి సీఎం, మంత్రులను బాధ్యులను చేయాలని లేఖలో స్పష్టం చేశారు. ఇదే అంశంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విజయవాడలో మాట్లాడారు. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కేంద్రానికి రాసిన లేఖపై బహిరంగ చర్చకు రావాలని ఆయన వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు. ఈ చర్చకు సమన్వయకర్తలుగా జర్నలిస్టు సంఘాల నేతలు, ప్రభుత్వ సలహాదారులు కే రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌లలో ఎవరైనా సరేనని ప్రతిపాదించారు.



దీంతో ఇదేం వ్యూహం రాబాబూ.. అంటూ క‌మ్యూనిస్టుల్లోనే ఓ వ‌ర్గం వీరిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇదేమ‌న్నా ప్ర‌జా స‌మ‌స్యా..? చ‌ర్చ‌కు పిల‌వ‌డానికి? అంటూ ప్ర‌శ్నించారు. టీడీపీకి.. చంద్ర‌బాబుకు అమ్ముడు పోయిన‌ప్పుడు కూడా ఇదే విధంగా చ‌ర్చ‌కు పిలిచి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. మొత్తానికి క‌మ్యూనిస్టులు రెంటికీ చెడ్డ రేవ‌డులు అయ్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: