అసలు ఎంత ధైర్యం ఆ కేసీఆర్ కి నాకు కరోనా రావాలని శాపనార్ధాలు పెడతాడా ..? నేను ఓ మీడియా అధిపతిని, తెలుగు రాష్ట్రాలను నా కనుసన్నలతో శాసించగల మేధావిని నన్నే అంత మాట అంటాడా ? నా పవర్ ఏంటో తెలియదా ? అంటూ మీడియా మేధావిగా చెప్పుకుని చెలరేగిపోతున్న ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ కడుపు మంటతో రగిలిపోతున్నాడు. తనకు తానే స్వయం ప్రకటిత మేధావిగా చెప్పుకుని చెలామణి అవుతున్న రాధాకృష్ణ ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడో ..? ఎలా వచ్చాడో ..? అందరికి  బాగా తెలిసిందే. అందరిని ఏకవచనంతో సంబోధిస్తూ, తన అంత గొప్ప మేధావి ఎవరూ లేరన్నది ఆయన ఇన్నర్ ఫీలింగ్ గా కనిపిస్తుంది. అసలు మొన్నటి వారం వచ్చిన ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వ్యాసం కొత్త పలుకు చూస్తేనే అర్ధం అయిపోతోంది. అసలు ఆయన స్వయం ప్రకటిత మేధావిగా, తనకు తాను ఎంత గొప్ప వ్యక్తినో నిరూపించుకునేందుకు ఎంత తాపత్రయపడుతున్నాడో... అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనను లెక్క చేయడంలేదు కాబట్టి వారు ఎందుకు పనికిరానివారిగా భావిస్తూ రాధాకృష్ణ రాసిన రాతలు ఎంత చెత్తగా ఉన్నాయో అని. 

 

IHG

అసలు రాధాకృష్ణ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అల్లకల్లోలం జరిగిపోతుంటే తానే రంగంలోకి దిగి ఆ బాధ్యతను నెరవేరుస్తున్నాను అన్నట్టుగా రాధాకృష్ణ ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు లోపాలను ఎత్తిచూపడం సరైనదే అనుకుంటే... మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో నెలకొన్న లోపాలను ఎందుకు ప్రస్నానించలేదు అన్నదే చాలామందిలో వస్తున్న డౌట్. కేవలం తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ని హైలెట్ చేయడమే పనిగా పెట్టుకున్న రాధాకృష్ణ ఆయన తప్ప ఇంకెవరూ గొప్ప వాళ్ళు లేరు అన్నట్టుగా టీడీపీ రాజకీయ ప్రత్యర్థులందరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోతుంటాడు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను క్రిమినల్ తో పోల్చడం ఒక పత్రికాధిపతిగా, పాత్రికేయుడిగా రాధాకృష్ణకు సమంజసమేనా ..? అలా పోల్చకూడదనే కనీసం జ్ఞానం ఉండాలి కదా ...? అసలు ఏపీ సీఎం జగన్ మీద కేసులు 

 

ఇంకా ఏవీ నిరూపణ కాలేదు. అవి మోపబడిన కేసులు మాత్రమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే నువ్వు మాత్రం గత ఆరేళ్లుగా జగన్ ను క్రిమినల్ గానే చూస్తూ, నీ పత్రికలో రాతలు రాస్తూ, మానసిక ఆనందం పొందుతున్నావు. అసలు జగన్ ను క్రిమినల్ అని డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా..?  న్యాయస్థానాలు లేదంటే ప్రజలు. ప్రజలు జగన్ కు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు చూస్తే సరిపోతుంది  కదా ! కానీ దాన్ని కూడా నువ్వు అపహాస్యం చేసేలా జగన్ గెలవడం ఏపీ ప్రజల ఖర్మ అని నీ కొత్త పలుకుల్లో పలికిన చెత్త పలుకులు నీకు గుర్తులేవా...?

 

అసలు చంద్రబాబు నిన్ను నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఇంకెవరూ పెట్టుకోరు కదా ! అసలు ఏపీ తెలంగాణ సీఎం లు ఇద్దరూ అంటే భయం లేదు అని చెబుతున్నావ్ కదా వారి మీద రాస్తున్న రాతలు నీ కొత్త పలుకులు వింటే అర్ధం అయిపోతుంది కదా నువ్వు ఎంత భయపడిపోతున్నావో. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజా క్షేత్రం నుంచి గెలిచినవారే కదా ..! దొడ్డిదారిలో గెలిచినవారు కాదుగా. అసలు ఇప్పుడు నీ బాధ అంతా అటు కేసీఆర్.. ఇటు జగన్ నీ మాట వినడంలేదు అనే కదా ..? అసలు నీ గురించి జనాల్లో ఎంత చులకన భావన ఉందో నీకు తెలుసా ..? అన్నట్టు ఇప్పుడు కరోనా విపత్తు సమయంలోనూ నువ్వు కేసీఆర్ ను టార్గెట్ కేసుని అసత్య కథనాలను వండివార్చుతున్నావ్ ..? అందుకే కదా నీకు కరోనా రావాలని ఆ కేసీఆర్ కోరుకుంది. అసలు నీకు కరోనా రానవసరంలేదు... నీకు ఉన్న కడుపుమంటతోనే ....... ?

మరింత సమాచారం తెలుసుకోండి: