తెలుగుదేశంపార్టీలో సీనియర్ నేతలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలు వింటుంటే వీళ్ళకి గానీ ఎల్లో వైరస్ ఏమన్నా సోకిందా అనే డౌట్ పెరిగిపోతోంది. ఏమి మాట్లాడాలో తెలియని స్ధితిలో ఏదో ఒకటి మాట్లాడకపోతే జనాలు తమను ఎక్కడ మరచిపోతారో అనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు, బుచ్చయ్యచౌదరి, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డి గురించి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.

 

ప్రతిరోజు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయకపోతే వీళ్ళకు నిద్రపట్టేట్లు కూడా లేదు. కరోనా వైరస్ ను జగన్ మొదట్లో చాలా తేలిగ్గా తీసుకున్నాడు అనే ఆరోపణలనే ఇప్పటికీ చంద్రబాబు దండు పదే పదే వినిపిస్తోంది. రాష్ట్రంలో ఒక్క కేసు మాత్రమే నమోదైన కాలంలో ఎవరైనా అలాగే లైట్ తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. జగనే కాదు తెలంగాణా సిఎం కేసియార్, ఆమాటకొస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా మొదట్లో వైరస్ ను తేలిగ్గానే తీసుకున్నాడు.

 

ఎప్పుడైతే వైరస్ తీవ్రతను గుర్తించారో వెంటనే కంట్రోల్ చేయటానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నీ తీసుకున్నారు, తీసుకుంటున్నారు కూడా.  చంద్రబాబు ఏమి మాట్లాడితే దాన్నే తమ్ముళ్ళు రిపీట్ చేస్తున్నారు. రైతులను పట్టించుకోవటం లేదని, పంటలను కొనుగోలు చేయటం లేదని, నిత్యావసరాలు పంపిణి చేయటం లేదనే ఆరోపణలనే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగ వినిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వరి, అరటిని భారీగా కొనుగోలు చేసిందన్న విషయం వీళ్ళకు కూడా తెలుసు. అయినా ఆరోపణలు చేయాలి కాబట్టి చేస్తున్నారంతే.

 

ప్రభుత్వం తరపున అర్హులైన కుటుంబాలకు తలా వెయ్యి రూపాయలతో పాటు బియ్యం, శెనగలు, పంచదార కూడా ఇచ్చాడు. మళ్ళీ రెండో విడత పంపిణికి రెడీ చేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంక్షోభ సమయంలో జగన్ తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు అండ్ కో  తట్టుకోలేకపోతున్నారు. అందుకే మొదట్లో పరీక్షలు చేయలేదన్నారు. ఇపుడు పరీక్షలు చేస్తుంటే కిట్ల కొనుగోలులో అవినీతన్నారు.

 

మొదటి నుండి వైరస్ విషయంలో అఖిలపక్ష సమావేశాలు పెట్టలేదంటూ గోల చేస్తున్నారు. ఉద్యోగుల జీతాల్లోను, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత పెట్టకూడదంటూ నానా యాగీ చేస్తున్నాడు. అధికారంలో నుండి దిగేనాటికి ఖజానాలో రూ 100 కోట్లుంచిన పెద్ద మనిషికి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి తెలిసికూడా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నాడంటే ఏమిటర్ధం ?   అందుకనే తమ్ముళ్ళందరికీ ఎల్లో వైరస్ ఏమన్నా సోకిందా అనే అనుమానం పెరిగిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: