ప్రతిపక్షంలోకి వచ్చినప్పటినుండి చంద్రబాబునాయుడు, లోకేష్ నుండి విచిత్రమైన మాటలు వినబడుతున్నాయి. ఇటువంటి మాటల్లో ఫ్రీడం ఆఫ్ ప్రెస్ కూడా ఒకటి. తాజాగా ముంబాయ్ లో రిపబ్లిక్ టివి చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామిపై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తు తండ్రి, కొడుకులు ట్విట్టర్లో మీడియా స్వేచ్చ గురించి తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు. 

చంద్రబాబు ఆలోచనలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అధికారంలో ఉన్నపుడు. రెండోది ఖర్మ కాలి ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చినపుడు.  అధికారంలో ఉన్నపుడు వినటానికి కూడా ఇష్టపడని పదాలేమిటంటే ప్రజాస్వామ్యం, నియమాలు, నిబంధనలు, ఫ్రీడం ఆఫ్ ప్రెస్, పారదర్శకత,  సోషల్ మీడియా, అఖిలపక్ష సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం మాట్లాడటం లాంటివి చాలానే ఉన్నాయి.

 

ప్రతిపక్షంలోకి రాగానే తరచూ వాడే పదాలేమిటంటే  అఖిలపక్ష సమావేశాలు, పాలనలో పారదర్శకత, ప్రజాస్వామ్యంపై అధికారపార్టీ దాడులు, మీడియా గొంతు నొక్కేయటం, మేధావుల సలహాలు తీసుకోవటం, ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కేయటం లాంటివి చాలానే ఉన్నాయి.  తాను అధికారంలో ఉన్నంత వరకూ జగన్మోహన్ రెడ్డి మీడియాను పొరబాటున కూడా పార్టీ ప్రెస్ మీట్లకు లేకపోతే తన ప్రెస్ మీట్లకు విలేకరులను రానీయలేదు. జగన్ మీడియాలో పనిచేసే రిపోర్టర్లపై అధికారికంగానే బ్యాన్ పెట్టాడు.

 

తనతో పాటు చినబాబు పరిపాలపై సెటైర్లు వేస్తున్నారనే ఆరోపణలతో ఫోస్ బుక్ లో పోస్టులు పెట్టిన ఎంతమందిని అరెస్టులు చేయించాడో లెక్కేలేదు. రాజధాని నిర్ణయం, సింగపూర్ కన్సార్షియంకు కాంట్రాక్టు అప్పగించేటపుడు, ప్రత్యేకహోదా విషయంలో ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. అలాగే తన హయాంలో ఎంఎల్ఏలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటు నేతల కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళపై ఎన్ని కేసులు పెట్టించాడో అందరికీ తెలిసిందే. చెవిరెడ్డి, పెద్దారెడ్డి లాంటి వాళ్ళను ఏకంగా జైళ్ళకే పంపాడు.

 

ఇక రోజాను అసెంబ్లీ నుండి నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. సస్పెన్షన్ చెల్లదని కోర్టు చెప్పినా అసెంబ్లీలోకి రోజాను అనుమతించటానికి చంద్రబాబు ఇష్టపడలేదు. ఇటువంటి చంద్రబాబు కూడా ఇపుడు కోర్టు తీర్పులు, ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఫ్రీడం ఆఫ్ ప్రెస్, న్యాయం, ధర్మం లాంటి తన మనస్తత్వానికి పడని  అనేక పదాలను చాలా తేలిగ్గా వాడేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: