చాలా కాలం తర్వాత వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ఫుల్లు ఫోర్సుతో వాయించేసింది. ఎన్టీవీ చర్చా కార్యక్రమంలో ముందుగా యాంకర్ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో మాట్లాడాడు. దేవినేని మాట్లాడినా,  యాంకర్ ప్రశ్నలు వేసినా అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అసలు టిడిపి నేతలు ఎవరు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నా జగన్మోహన్ రెడ్డిని  టార్గెట్ చేయటమే ధ్యేయంగా ఉంటోందన్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఇందులో భాగంగానే యాంకర్ కూడా దేవినేనితో మాట్లాడించాడు. దానికి తగ్గట్లే దేవినేని కూడా మాట్లాడిన 15 నిముషాలూ ప్రభుత్వాన్ని, జగన్నూ విమర్శిస్తునే, ఆరోపణలు చేస్తునే ఉన్నాడు. నిజానికి జగన్ పై దేవినేని చేసిన ఆరోపణల్లో చాలా వరకు తమను ఓడించాడన్న కసితో చేస్తున్న ఆరోపణలే అని అర్ధమైపోతోంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చేస్తున్న ఆరోపణలు, విమర్శలనే ఇపుడు కూడా చేశాడు. కాకపోతే కొత్తగా కరోనా వైరస్ సంక్షోభం వచ్చి చేరిందంతే.

 

తర్వాత ఇదే యాంకర్ రోజాతో లైవ్ లో మాట్లాడాడు. దేవినేనితో మాట్లాడినట్లే యాంకర్ రోజాతో కూడా మాట్లాడాడు. అంటే కరోనా వైరస్ ను అరికట్టటంలో ప్రభుత్వం విఫలమైందని దేవినేని అంటున్నాడంటూ మొదలుపెట్టాడు యాంకర్. దాంతో రోజా ఫుల్లుగా వాయించేసింది.  ప్రభుత్వం విఫలమైందంటూ టిడిపి వాళ్ళకు చెప్పి తమను తిట్టించటమే మీడియా పనిగా పెట్టుకుందంటూ ఎంఎల్ఏ రెచ్చిపోయింది. కరోనా వైరస్ సంక్షోభంలో తమను నమ్ముకున్న వారికి సాయం చేయటంలో భాగంగా తాము నియోజకవర్గంలో తిరుగుతుంటే తమను టిడిపి విమర్శించటం ఏమిటంటూ వాయించేసింది.

 

ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై రాళ్ళేయటం చంద్రబాబునాయుడుకు అలవాటైపోయిందంటూ మండిపోయింది.  బాధితులకు అంతగా సాయం చేయాలంటే వచ్చి జనాల్లో తిరగమని చెప్పండి ఎవరొద్దన్నారు అంటూ నిలదీసింది. ప్రభుత్వం పరీక్షలు ఎక్కువ చేస్తోంది కాబట్టి పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని చెప్పింది.  ఏపిలో పరీక్షలు జరుపుతున్నట్లు దేశం మొత్తం మీద మరే రాష్ట్రంలోను జరగటం లేదని బల్లగుద్ది మరీ చెప్పింది. చంద్రబాబును  పనిలో పనిగా పుష్కరాల్లో 30 మంది చనిపోవటం, సిసి ఫుటేజిని కాల్చేయటం లాంటి విషయాలపై దుమ్ము దులిపేసింది.  

 

సరే టిడిపి నేతలను జాడించేసిన రోజా అదే ఊపులో మీడియాను కూడా వాయించేసింది. ఎంతసేపు టిడిపి వాళ్ళలాగ మీడియా కూడా తమనే టార్గెట్ చేస్తోందంటూ మండిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నపుడూ తమనే టార్గెట్ చేసి ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమనే టార్గెట్ చేయటంలోనే మీడియా ఉద్దేశ్యం తెలిసిపోతోందన్నది.  మొత్తానికి రోజా దెబ్బకు యాంకర్ కు  కూడా ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: