తనది ఎంత చీప్ మెంటాలిటీయో నారా లోకేష్ మరోసారి  బయటపెట్టుకున్నాడు. తన చవకబారు రాజకీయానికి చివరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా లోకేష్ వదలటం లేదు.  ఇంతకీ విషయం ఏమిటంటే లోకేష్ తన ట్విట్టర్లో శ్రీవారి ఆలయానికి సంబంధించి ఓ ట్వీట్ పెట్టాడు. అదేమిటంటే వైరస్ కారణంగా భక్తులకు దర్శన భాగ్యమే లేని రోజుల్లో కూడా వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరుకుకున్నాయి ? అంటూ ఏకంగా ఆ దేవదేవుడినే ప్రశ్నించేశాడు. అదేదో భద్రాచల రాముడుని భక్తుడు కంచర్లగోప్పన్న @ రామదాసు ప్రశ్నించిన  లెవల్లో.

 

ఈ ప్రశ్నలోనే లోకేష్ అతి తెలివంతా బయటపడిపోయింది. లోకేష్ చెప్పినట్లు వైఎస్ తోడల్లుడు కాదు దర్శనం చేసుకున్నది. టిటిడి ట్రస్టుబోర్డు ఛైర్మన్ హోదాలో వైవి సుబ్బారెడ్డి. అదికూడా కరోనా వైరస్ సంక్షోభం నుండి ప్రపంచం గట్టెక్కాలని టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలోనే ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి. ఆ హోమంలో ఛైర్మన్ హోదాలో వైవి సుబ్బారెడ్డి దంపతులు పాల్గొంటున్నారు. మొన్నటి శుక్రవారం నాడు హోమం అయిపోయిన తర్వాత శ్రీవారికి జరిగే అభిషేకంలో పాల్గొన్నాడు.

 

దర్శనంలో పాల్గొన్నది ఛైర్మన్ దంపతులు మాత్రమే. వారితో పాటు ఫొటోలో ఉన్నది బంధువులు కాదు. అందరూ ఆలయ అధికారులు, సిబ్బంది మాత్రమే. ఫొటో చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది వైవి సుబ్బారెడ్డి దంపతులని. కానీ లోకేష్ మాత్రం టిటిడి ఛైర్మన్ అని కాకుండా ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ తోడల్లుడని ట్విట్టర్లో చెప్పటంలో అర్ధమేంటి ? నిబంధనలు తుంగలో తొక్కి శ్రీవారి సన్నిధిలో పుట్టినరోజు జరుపుకోవటం అపరాధం కాదా ? అంటూ ఓ పిచ్చి ప్రశ్న కూడా వేశాడు.

ఆలయంలోకి   ట్రస్టుబోర్డు ఛైర్మన్, సభ్యులు ఎప్పుడైనా ప్రవేశించవచ్చన్న కనీసం ఇంగితం కూడా లోకేష్ కు ఉన్నట్లు లేదు. శ్రీవారి దర్శనాన్ని నిలిపేసింది భక్తులకే కానీ ఆలయ అధికారులు, సిబ్బందికి కాదన్న విషయం లోకేష్ కు తెలీదా ? భక్తులకు దర్శనాన్ని ఆపేసినా శ్రీవారికి జరిగే నిత్యపూజలు, సేవలు ప్రతిరోజు జరుగుతున్నాయి. కాబట్టి ఛైర్మన్ హోదాలో వైవి సుబ్బారెడ్డి శ్రీవారిని దర్శించుకోవటంలో తప్పేలేదు.

 

తమ హయాంలో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో క్షుద్రపూజలు జరిగిన విషయాన్ని బహుశా మందలగిరి లోకేష్ మరచిపోయినట్లున్నాడు. క్షుద్రపూజల అంశం ప్రభుత్వాన్ని కుదిపేసినా అప్పట్లో దానిపై స్పందించేందుకు లోకేష్ ధైర్యం కూడా చేయలేదు. విచారణ జరిపి పూజారులు, అధికారులపై వేటు వేశారే కానీ చంద్రబబు, లోకేష్ మాత్రం నోరిప్పలేదు. అలాంటిది ఛైర్మన్ హోదాలో వైవి సుబ్బారెడ్డి శ్రీవారం ఆలయంలోకి వెళితే మాత్రం ఆరోపణలతో రెచ్చిపోతున్నాడు. మొత్తం మీద లోకేష్ తన అజ్ఞాన్ని తాను బయటపెట్టుకున్నాడు. అందుకే అందరూ లోకేష్ ను పప్పు అనేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: