చేసింది ఏమి లేకపోయినా కొంతమంది డప్పు కొట్టుకోవడం, భజన చేయించుకోవడంలో  ముందుటారు. అది తమ వల్ల సాధ్యమయ్యే పనికాదని తెలిసినా వేరే వాళ్ల ద్వారా ఆ పని అయ్యింది అని తెలిసినా అదంతా తమ గొప్ప అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ప్రచారం చేసుకోవడం అస్సలు ఎవరూ వెనక్కి తగ్గారు. అటువంటి వారు ఎక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఏపీ రాజకీయ నాయకులు చాలా మంది ఆ విధంగానే లేని డప్పు కొట్టుకుంటూ అభాసుపాలవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. ప్రతి విషయంలోనూ వీరు ప్రభుత్వ తీరును తప్పు పట్టడమే కాకుండా, ప్రజలకు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే అదంతా తమ కృషి అన్నట్లుగా మీడియాలో ప్రచారం చేసుకోవడంలో ముందుంటున్నారు. 

 

IHG

ప్రస్తుతం కరోనా వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టకుండా వాడుకునేందుకు ఈ ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు విధించారు. కానీ ఈ నిబంధనలు విధిస్తున్నట్టు ముందుగా ప్రకటించి కొంత సమయం కూడా ఇవ్వకపోవడంపై వ్యాప్తంగా కేంద్రం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నలభై రోజుల పాటు వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వారిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఉన్నారు. సుమారు 5 వేల మంది వరకు గుజరాత్ చిక్కుకుపోయారు. నెలరోజులుగా అనేక ఇబ్బందులు పడుతూ అక్కడే ఉన్నారు. లాక్ డౌన్ సమర్థించిన అన్ని రాజకీయ పార్టీలు మత్స్యకారులకు మద్దతుదారులం అన్నట్టుగా వ్యవహరించే ప్రయత్నాలు చేశాయి. 

 

IHG

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాస్త ఎక్కువగా ఓవరాక్షన్ చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. తమ నాయకుడు చంద్రబాబు గుజరాత్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలంటే గుజరాత్ లో ఇరుక్కుపోయిన మత్స్యకారులను ఏపీకి పంపించారని, దీంట్లో చంద్రబాబు రాజకీయ పలుకుబడి, ఆయన రాసిన లేఖలే కారణమని టిడిపి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. మత్స్యకారులు ఏపీకి రాగలిగారు అంటే అదంతా  చంద్రబాబు గొప్పతనమేనని పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి టీడీపీ అనుకూల మీడియా కూడా వంత పాడుతోంది. ఈ సంగతి ఇలా ఉంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తానేమి తక్కువ తినలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పవన్ మొత్తం కేంద్రాన్ని, గుజరాత్  ప్రభుత్వాన్ని కదిలించినట్లుగా చెప్పుకుంటున్నారు. 

IHG


అక్కడితో ఆగకుండా మత్స్యకారులు ఏపీకి చేరుకోవడంపై గుజరాత్ ముఖ్యమంత్రికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ ట్వీట్ చేశారు. అయితే ఇందులో పవన్ చేసింది ఏమీ లేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా గొప్పగా దీనిని టముకు వేయించుకున్నారు. అయితే ఇదంతా జరగడం వెనుక వైసిపి అధినేత జగన్ కృషి అన్న సంగతి అందరికీ తెలుసు. మొదటి నుంచి ఈ విషయంలో జగన్ సీరియస్ గానే వ్యవహరించారు. అనేకసార్లు గుజరాత్ ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. 

 

అంతేకాకుండా మత్స్యకారులను ఏపీకి తీసుకువచ్చేందుకు సుమారు మూడు కోట్ల రూపాయల నిధులను, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అసలు జగన్ ఈ విధంగా వ్యవహరించకపోతే మత్స్యకారులు ఏపీకి వచ్చి ఉండేవారు కాదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు టిడిపి, జనసేన ఇప్పటికీ  ప్రయత్నాలు చేస్తున్నాయి. లేని గొప్ప అంతా చెప్పుకుంటూ ముప్పు తిప్పలు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: