అవును చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాకు కేసియారే కరెక్టు మొగుడు అనే అనిపిస్తోంది. ఎవరినీ, ఏ విషయంలో కూడా కేసియార్  నోరెత్తనీయటం లేదు. కేసియార్ నిర్ణయాలను తప్పుపట్టే ప్రతిపక్షాలు లేవు, తప్పులు పడుతూ వార్తలు, కథనాలు రాసే దమ్మున్న మీడియానే లేదంటే అతిశయోక్తి కాదు. గడచిన ఆరు సంవత్సరాలుగా తెలంగాణాలో ఇదే పరిస్దితి కనిపిస్తోంది. తాజాగా కరోనా వైరస్ సంక్షోభం విషయంలో మరిత స్పష్టమైపోయింది ఈ విషయం.

 

ఏపిలో జగన్ పరీక్షలు చేయిస్తుంటే చంద్రబాబు, ఎల్లోమీడియా తప్పు పట్టారు. పరీక్షలు ఎక్కువ చేయటం వల్ల కేసులు ఎక్కువగా బయటపడుతుంటే కేసులెక్కువైపోతున్నాయన్నారు. క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తుంటే ఏర్పాట్లు సరిగా లేవంటున్నారు. దక్షిణకొరియా నుండి వైరస్ నిర్ధారిత పరీక్షల కిట్లను తెప్పిస్తే అందులో అవినీతి జరిగిందని యాగీ చేస్తున్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళ కారణంగా కేసులు పెరిగిపోతే జగన్ చేతకాని తనం వల్లే కేసులు పెరిగిపోతున్నాయంటూ గోల చేస్తున్నారు.

 

తాజాగా మద్యం దుకాణాలు తెరిస్తే జగన్ పై మండిపడిపోతున్నారు. ధరలు 75 శాతం పెంచితే తాగుబోతుల రక్తం తాగుతున్నాడు జగన్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. మద్యంషాపులు తెరవాలన్న నరేంద్రమోడి నిర్ణయానికి కూడా జగన్నే తప్పు పడుతున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ఏమి చేసినా తప్పే, ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా తయారైంది చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియా వైఖరి. చివరకు తప్పుడు వార్తలు రాసి జగన్ పై బురద చల్లేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

సీన్ కట్ చేస్తే కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు అందరికీ చేయాల్సిన అవసరం లేదని కేసియార్ తేల్చి చెప్పేశాడు. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా నోరిప్పితే ఒట్టు. ఏపికన్నా తెలంగాణాలో కేసులు ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా వైరస్ పెరిగిపోతోందని ఒక్క మీడియా కూడా రాయలేదు. అబద్ధపు, పిచ్చి వార్తలు రాస్తే బొందపెడతానని బహిరంగంగా వార్నింగ్ ఇస్తే నోరిత్తెని మీడియా లేదు. మరి మీడియా స్వేచ్చ ఏమైందో ఎవరికీ తెలీదు. ఏపిలో జగన్ ను ధైర్యముంటే  కర్నూలుకు వెళ్ళి బాధితులను పరామర్శించాలంటూ టిడిపి నేతలు చాలెంజ్ చేస్తున్నారు. మరి అదే నోళ్ళు తెలంగాణాలో కేసియార్ విషయంలో ఎందుకు లేవటం లేదు ?

 

ఏపిలో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసులు పెరిగిపోవటానికి జగన్ అసమర్ధతే కారణమని ప్రతిరోజు గోల గోల చేస్తున్నారు. మరి హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరిగిపోవటానికి కేసియారే కారణమని ఒక్క ప్రతిపక్షం కూడా ఆరోపణలు చేయలేకపోతోంది ? ఇదే విషయంలో ఎల్లోమీడియా ఎందుకు కేసియార్ ను నిలదీయలేకపోతోంది ?  ఎందుకంటే భయం. అవును నిజ్జంగా కేసియార్ అంటే భయపడిపోతోంది మీడియా.  అందుకే కేసియార్ ఏమి మాట్లాడినా, ఏమీ చేయకపోయినా మీడియా పట్టించుకోదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: