ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు బాధని ఏమని వర్ణించాలో ఎవరికీ అర్ధం కావటం లేదు. ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనబోతున్నాడని తెలియటంతోనే చంద్రబాబులో బాధ పెరిగిపోతుండవచ్చు. ప్రతి విషయంలోను వ్యక్తిగత ప్రచారానికి మాత్రమే పాకులాడే చంద్రబాబు ప్రస్తుత పరిస్ధితుల్లో ఎవరికీ కాకుండా అనామకంగా ఉండిపోయాడు.  ఇటు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అటు జనాలు పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. అదే సమయంలో కేంద్రం కూడా చాలా లైట్ గా తీసుకుంది.

 

24 గంటలు ప్రధానమంత్రి దృష్టిలో పడాలన్న తాపత్రయంతో చంద్రబాబు గడచిన 11 మాసాలుగా ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అందరూ చూస్తున్నదే. నిజానికి చంద్రబాబు పడుతున్న అవస్తలు చూసి పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. కరోనా వైరస్ సంక్షోభం నుండి గట్టెక్కటానికి మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, కొందరు సిఎంలతో పాటు మరికొందరు మాజీ సిఎంలతో మోడి మాట్లాడినట్లు తెలియగానే చంద్రబాబు కుతకుత ఉడికిపోయాడు. తన సీనియారిటిని, ప్రాధన్యతను మోడి గుర్తించలేదన్న విషయం అందరికీ తెలిసిపోయిందని చంద్రబాబు తెగబాధపడిపోయాడు.

 

అప్పటి నుండి మోడికి లేఖలు రాయటం, మాట్లాడేందుకు ప్రయత్నించటం చేస్తునే ఉన్నాడు.  మొత్తానికి తనతో మోడి ఫోన్లో మాట్లాడాడంటూ చెప్పుకుని తృప్తి పడ్డాడు. గ్యాస్ ప్రమాదం నేపధ్యంలో  వైజాగ్ వెళ్ళటానికి మోడికి లేఖ రాయటంతో చంద్రబాబు పైత్యం ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. అలాంటిది సిఎంలతో మోడి వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తుండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వీడియో కాన్ఫరెన్సులో జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటున్నాడన్నదే అసలు బాధ.

 

కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఇప్పటికే మోడి-జగన్ చాలాసార్లు మాట్లాడుకున్నారు.  తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా మోడి చంద్రబాబుకు అపాయిట్మెంట్ ఇవ్వలేదు. చివరకు వైసిపి నేతలతో కూడా మాట్లాడిన మోడి చంద్రబాబును మాత్రం దగ్గరకు రానీయలేదు. సరే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత మోడికి వ్యతిరేకంగా ఎంత గోల చేశాడో అందరూ చూసిందే.  అలాంటిది ఇపుడు మళ్ళీ మోడికి దగ్గరవుదామని నానా అవస్తలు పడుతున్నా సాధ్యం కావటం లేదు.

 

అందుకనే సిఎంలతో మోడి వీడియా కాన్ఫరెన్సనగానే చంద్రబాబు ఉడికిపోతున్నాడు. ఎలాగూ దాన్ని ఆపలేడు కాబట్టే మోడికి చంద్రబాబు లేఖలు రాశాడు, మోడి చంద్రబాబుకు ఫోన్ చేసి సలహాలడిగాడు అంటూ సొల్లు కథనాలు రాయించుకుంటున్నాడు.  మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాధ ఎప్పటికి ? ఎలా తీరుతుందో ఏమో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: