ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా మా చినబాబు లోకేష్ మీద సెటైర్లు వేయడమే కానీ అసలు ఇప్పుడు ఆయన ఎంత గొప్ప పని చేసాడో ఎవరికీ అర్ధం కావడంలేదు. రాజకీయంగా పప్పు అని బిరుదులు ఇవ్వడమే కాదు. లావుగా ఉన్నాడు అంటూ ఆయన మీద జోకులు వేసేవాళ్లకు కొదవే లేదు. ఏమన్నా అన్నాం అంటే అన్నాం అంటారు కానీ కాస్త బొద్దిగా ఉంటే ఇలా జోకులు వేసేస్తారా ? ఈ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళకు అస్సలు పనీ పాట లేనట్టుంది ఎప్పుడూ మా సినబాబు గారి మీదే జోకులు వేసుకుంటూ నవ్విస్తూ ఉంటారు. ఇది అసలే కలికాలం కాదురా నాయనా. కరోనా కాలం ఎవడి ఇంట్లో వాడు వండుకుని తిన్నది తప్ప బయటకి రావొద్దు మొర్రో అని మొరపెట్టుకుంటున్న కాలం. ఇంకేముంది పాతివోడు పని పాట లేకుండా తినేస్తారు లావు అయిపోతారు అని ఎన్నో జోకులు వేసుకున్నారు. 

 

IHG

 

ఇక్కడ కూడా మా సినబాబు ని వదిలిపెట్టలేదు కదా. ముద్దు ముద్దుగా, బొద్దు బొద్దుగా ఉండే మా సినబాబు ఇంకాస్త బొద్దిగా అయిపోబోతున్నాడు అంటూ జోకులు మీద జోకులు వేసుకున్నారు. ఈ ఇసయాలు మా సిన బాబుకి తెలిసింది. అందుకే ఛీ పాడు జన్మ అందరితోనూ తిట్లు తినడమేనా అనుకుంటూ కసి కసిగా హైదరాబాద్ లో మూతికి మాస్క్ కట్టుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోయి రోడ్లపైకి వచ్చి సైకిలింగ్, ఇంట్లో జిమ్ మిషన్ లు పెట్టుకుని రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డాడు. ఇప్పుడు ఏపీకి వచ్చిన మాలోకం బాబు ని సారీ సారి మా సినబాబు ని చూసి బా .....బు గారు ఏంటి మీరేనా ...? అసలు మా కళ్ళకి కనిపిస్తుంది కలా నిజమా ..? ఎప్పుడూ మేము మిమ్మల్ని ఇలా చూస్తామనుకోలేదు అంటూ ఇప్పుడు మహా నాడు ఏర్పాట్లు చూస్తున్న సిన బాబు గారిని అడిగేసారంట ఆయన ఫ్యాన్స్.

IHG


 అసలు మీరు ఇంత స్లిమ్ గా అందంగా ఎలా ఉన్నారు బాబు ..? అసలు ఇలా ఎలా సాధ్యం అయ్యింది అని అడిగితే ... ఓస్ అదా..! ఇప్పటికే బొద్దుగా ఉన్నాను కదా లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చుని సికెన్లు, మటన్ లు తినేసి మరీ లావు అయిపోతే పార్టీ సైకిల్ ఎలా తొక్కాలి అందుకే కసి కసిగా వొళ్ళు తగ్గించేశా అంటూ మెలికలు తిరిగిపోతూ చెప్పాడంట. లాక్ డౌన్ కి ముందు ..ఇప్పుడు సినబాబు ని చూసిన వాళ్లంతా వార్నీ ఏంటి లోకేశేనా ..? ఇలా ఐపోయాడేంటి అంటూ చెవులు ... చేతులు కొరికేసుకుంటున్నారట. ఈ స్లిమ్ బాడీతో రాజకీయాలు వదిలేసి సినిమా హీరో అయిపోతాడా ఏంటి ...? అనే అనుమానం ఇప్పుడు అందరికి వచేత్తందంట. ఇప్పుడు సినబాబు సూత్తే ... ఎవరైనా మందలగిరి సెల్ఫీ దిగాల్సిందే.  

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: