చేతికి ఎముకే లేదన్నట్టుగా ఆ రాజన్న బిడ్డ సొమ్ములు ఖర్చుపెడుతున్నాడు. ఎవరూ ఇబ్బంది పడకుండా ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. అసలు ఈ కరోనా కాటుకి సొమ్ములు లేక అన్ని రాష్ట్రాలు దాదాపు దివాళా తీసే రేంజ్ కి వచ్చేస్తే ఈ ఏపీ లో ఏంట్రా బాబు ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాల్లో కోతలు కోయకుండా అందరినీ హ్యాపీగా ఉంచేస్తున్నాడు. అసలు ఈ సొమ్ములు ఎక్కడి నుంచి తెస్తున్నాడ్రా బాబు అనుకుంటూ ఇప్పుడు తెలంగాణ తో పాటు మరి కొన్ని రాష్ట్రాల సీఎం లకు డౌట్ తో కూడిన అనుమానం. ఎహె మిగతా రాష్ట్రాల గోల మనకెందుకు మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం, ధనిక రాష్ట్రం గురించి చెప్పుకుందాం. అసలే ఈ రెండు రాష్ట్రాల సీఎంలు మంచి ఫ్రెండ్స్ కదా ! పోతిరెడ్డిపాడు అంటూ రెండు రాష్ట్రాల మధ్య పెద్ద యుద్ధమే జరగాల్సి ఉన్నా... ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ సామరస్య పూర్వకంగా సెటిల్ చేసుకునే ఒప్పందం మేరకు ఆ ఇష్యూని కూడా సైలెంట్ చేసేసారు కదా ..? అది వేరే విషయం అనుకోండి. 

IHG


ఇప్పుడు ఈ కరోనా కాటు గురించి చెప్పుకుందాం. ఈ జగన్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది అవుతుంది. వచ్చీ రావడంతోనే ఎన్నికల మ్యానిఫెస్టో, నవరత్నాలు అనుకుంటూ ఒకటే హడావుడి. వట్టి హడావుడి అయితే ఫర్వాలేదు. అన్నీ చెప్పినట్టే చేసిపడేశాడు. వార్నీ ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా బాబు అని అందరికి పెద్ద డౌట్ వచ్చి పడింది. ఎందుకంటే ఈ జగన్ కంటే ముందు ఉన్న పెద్ద మనిషి ఖజానా మొత్తం ఖాళీ చేయడమే కాదు. ఇదిగో జగన్ మూడు లక్షల కోట్లు ఈ జనాల కోసం అప్పు చేశా .. కాస్త కట్టిబెట్టవోయ్ అంటూ కుర్చీ దిగిపోయాడు. తప్పేదేముంది లే అనుకుంటూ ఆ జగన్ అవస్థలు అపడుతూనే ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు.

IHG


 పక్కనే ఉన్న తెలంగాణ సంగతి చెప్పుకుంటే ఆదాయానికి ఎటువంటి ఢోకా లేని హైదరాబాద్ అక్కడే ఉన్నా... ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయి ఉద్యోగులకు జీతాలు మొత్తం ఇవ్వలేను మొర్రో అనుకుంటూ కరోనా ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇచ్చే 1500 సొమ్మును కూడా ఆపి పడేసాడు ఆ కేసీఆర్. అరే ఏందిరబై లాక్ డౌన్ లా దుకాణాలు, ఆపీసులు మోసేసినారుగా సర్కారోళ్లకు సొమ్ములు యాడ నుంచి తేవాల్రా బై...? అందుకే ఈ నెల సగమే జీతం ఇస్తా అని చెప్పేసాడు. మరి ఏపీలో కూడా దుకాణాలు, ఆపీసులు మూసినాను గదా ..? యాడి నుంచి ఈ జగన్ సొమ్ములు తెస్తున్నాడు ..? జీతాలు మొత్తం ఇచ్చేస్తా అని చెప్పిండు .. సంక్షేమ పథకాలకు కోతలు పెట్టలేదు..! అసలు యాడ్నించి తెస్తున్నాడ్రా బై ఈ జగన్ సొమ్ములు ...? ఆ మోదీ ఏమన్నా సీక్రెట్ గా పంపుతున్నాడా ..? ఇదే కదా కేసీఆర్ సార్ ఇప్పుడు వస్తున్న డౌటానుమానం !  

 

మరింత సమాచారం తెలుసుకోండి: