మొత్తానికి జూమ్ జామ్ గా జరిగిపోయింది జూమ్ నాడు.సారి సారి మహా నాడు. దేశం మొత్తం నోరెళ్లబెట్టింది. అసలు ఇలా ఎలా ...? ఒక పార్టీ సమావేశాలు ఇలా కూడా చేయవచ్చా ...? అని 'దేశం' అంతా నోరెళ్లబెట్టింది. ఏదైనా బాబు గారికే సాధ్యం. జూమ్ లో అయినా మరెక్కడైనా ధూమ్ ధామ్ గా ఏదైనా చేయాలంటే బాబు గారికే సాధ్యం. పావలా చేసి పది రూపాయల ప్రచారం చేసుకోవడంలో ఎవరైనా బాబు గారి తరువాతే కదా ..?  అసలు మహానాడు ఎందుకు పెట్టారు..? ఏం సాధించారు ..? అంటే లోకేశం బాబు బరువు తగ్గినందుకు అందరూ చిటికెలు వేసి మరీ అభినందనలు తెలపడానికి కదా ..?  బాబు గారు, చినబాబు గారు అంత గొప్ప ప్రపంచ మేధావులు లేరంటూ పొగడ్తల వర్షం కురిపించుకోవడానికే కదా ? మరి బాబు గారు ఊరికే ఊరుకుంటారా ..? ఏం చేశారు అంటే ..? ఆ జగన్ ను అర్జెంటుగా దించేస్తే నేను కుర్చీ ఎక్కేసి చక్రాలు, బొంగరాలు తిప్పాలి అనే తొందర్లో ఉన్నాడు.

IHG


అసలు బాబు గారు చెబుతున్నట్టుగా ఒక వేళ నిజంగా ఎన్నికలు కనుక వస్తే ..? బాబు గారు ఇచ్చే ఎన్నికల హామీలు ఏంటో తెలుసా ...? 

01 . జగన్ అమలు చేస్తున్న అన్ని పథకాలు రద్దు 

02 .వాలంటీర్ల వ్యవస్థ రద్దు, గ్రామ సచివాలయ ఉద్యోగాల తీసివేత,

03   నవరత్నాలు రద్దు  

04 . ప్రతి డ్వాక్రా మహిళకు 25 కాసుల బంగారు తాడు. పది లక్షల నగదు 

05 . చేతిపని వారికి బీఎం డబ్ల్యూ కారు.

06 . బడి పిల్లలకు యాపిల్ 1000  జీబీ రామ్ లాప్ టాప్ 

07 .రైతులకు పంట స్ప్రే ల నిమిత్తం హెలీకాఫ్టర్స్, 

08 . తెల్ల రేషన్ కార్డుదారులు అందరికీ ఉచిత విమాన ప్రయాణం.

09 . వీధి వీధికి పోలీస్టేషన్

10 . పదవ తరగతి చదివిన వారందరికీ ఐఏఎస్ పోస్ట్

11 .ప్రతి గ్రామంలోనూ ఒక మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్ 

12 . పింఛన్ దార్లకు 25 లక్షల విలువ చేసే ప్లాట్. 

13 . వృద్దులకు నెల నెల ఇచ్చే పింఛన్ 25 వేలకు పెంపు.

14 . 15 రోజుల్లో అమరావతి నిర్మాణం చేపట్టి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడం.  

మరింత సమాచారం తెలుసుకోండి: