గడచిన ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న అనేక నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోయాయి. కొన్ని కేసుల్లో అయితే కోర్టులు తీవ్రంగానే ప్రభుత్వానికి అక్షింతలు వేసింది.  గడచిన పదిహేను రోజుల్లో అయితే చాలా కేసుల్లో ప్రభుత్వంపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. అసలు ఇన్ని కేసుల్లో కోర్టుల నుండి ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకత, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ? అన్న విషయంపై ఇపుడు తీవ్రమైన చర్చ మొదలైంది. తాజాగా ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు చెల్లదంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ కు కోర్టులో వ్యతిరేకమనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఇందులో వాస్తవం ఏమిటి ? అవాస్తవం ఏమిటి ? అనే విషయాలపై చర్చ జరగాల్సుంది. కొన్ని కేసుల్లో కోర్టులు ప్రభుత్వాన్ని ఆక్షేపించిన తీరుతో జనాలు కూడా ఆశ్చర్యపోయిన మాట వాస్తవమే.  ఉదాహరణ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయిస్తే దాన్ని కూడా కోర్టు కొట్టేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పుతో మామూలు జనాలు చాలామంది ఆశ్చర్యపోయారు.

 

అలాగే పేదలకు ఇళ్ళ స్ధలాలు కేటాయించేందుకు ప్రభుత్వం భూములను సేకరిస్తుంటే దాన్ని కూడా కోర్టు అడ్డుకుంది. నిధుల అవసర కోసం ప్రభుత్వం భూములను అమ్మాలని అనుకుంటే దాన్ని కూడా అడ్డుకున్న కోర్టు ’ప్రభుత్వం దివాలా తీసిందా’ అని ప్రశ్నించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అవసరానికి భూములు సేకరించటం, అమ్మటం అన్నది అన్నీ రాష్ట్రాలు చేస్తున్నదే. మరి దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని కోర్టులకు లేని అభ్యంతరాలు ఇక్కడి కోర్టులకు మాత్రమే ఎందుకనో అర్ధం కావటం లేదు.

 

సరే  ఈ విషయాన్ని పక్కనపెట్టేస్త జగన్ స్వయంకృతమని చెప్పుకునేందుకు కొన్ని కేసులున్నాయి. పంచాయితీ భవనాలకు వైసిపి రంగులు వేయటం. పంచాయితీ భవనాలంటే ప్రభుత్వ భవనాలని అర్ధం. మరి ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటమేంటి ? అసలు ఈ సలహా జగన్ కు ఎవరిచ్చారో ? పోనీ పంచాయితీ భవనాలకు రంగులు వేయటం వల్ల పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ? పార్టీకి ఏ విధంగాను ఉపయోగంలేని పనిచేసి కోర్టులతో జగన్ అక్షింతలు వేయించుకోవటం కేవలం స్వయంకృతమనే చెప్పాలి.

 

తాజాగా నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారం కూడా అంతే. ఎన్నికల కమీషనర్ ను ప్రభుత్వం నియమించగలదే కానీ తొలగించలేందు. ఎన్నికల కమీషనర్ ను తొలగించాలంటే హైకోర్టు ద్వారా కానీ లేకపోతే పార్లమెంటు ద్వారా మాత్రమే తొలగించాలి. పై రెండు మార్గాలను కాదని తనిష్టం వచ్చినట్లు నిర్ణయం తీసేసుకుని ఆర్డినెన్సు ద్వారా నిమ్మగడ్డను పదవిలోనుండి ఊడిబీకేశాడు. దాంతో వ్యవహారం కోర్టుకెళ్ళి చివరకు జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: