ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో వేమూరి రాధాకృష్ణ రాసే చె(కొ)త్తపలుకులో ఈవారం విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశాడు. అదేమిటయ్యా అంటే ’వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశంపార్టీతో అవగాహన ఉంటుందని, సీటు గ్యారెంటీ ఉంటుందని హామీ ఇస్తే పదిమందికిపైగా ఎంపిలు బిజెపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు’ అనే ప్రచారం జరుగుతోందిట.  చెత్త రాతలను  మీరు నమ్ముతారా ? లేదా ? అన్నది వేరే సంగతి. కానీ వేమూరి రాసింది మాత్రం యదార్ధం. దీంతోనే వేమూరి మనసులోని మాటేమిటో అందరికీ అర్ధమైపోతోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టిడిపితో అవగాహన ఉంటుందని ఎవరు, ఎవరికి హామీలు ఇవ్వాలి ? అలాగే అవగాహన ఉంటుందనే హామీతో పాటు సీటు గ్యారెంటీ అని కూడా హామీ ఇవ్వాలట. ఈ హామీ కూడా ఎవరివ్వాలి ?  పై రెండు హామీలిప్తే అప్పుడు పదిమందికి పైగా వైసిపి ఎంపిలు  బిజెపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోందని రాధాకృష్ణ భలే జోక్ వేశాడు. అసలు బిజెపికి రాష్ట్రంలో ఉన్న ఓట్లెన్ని ? పోనీ మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లెంతో వేమూరి మరచిపోయినట్లున్నాడు. నోటాకు వచ్చిన ఓట్లకన్నా బిజెపికి తక్కువ ఓట్లొచ్చాయని వేమూరికి గుర్తుందో లేదో.

 

నిజానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు సీట్లలో పోటి చేయటానికి కమలంపార్టీకి అసలు గట్టి అభ్యర్ధులే దొరకలేదు.  ఎవరి విషయమో ఎందుకు నరసరావుపేట పార్లమెంటుకు పోటి చేసిన బిజెపి అభ్యర్ధి, బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వచ్చిన ఓట్లెన్నో తెలుసా, 18 వేలు. అంటే డిపాజిట్ కూడా రాలేదు. కన్నాకే కాదు కమలం తరపున పోటి చేసిన ఏ ఒక్క అభ్యర్ధికీ కనీసం డిపాజిట్ దక్కించుకునేందుకు దగ్గరలో కూడా ఓట్లు రాలేదు. దీంతోనే బిజెపి పరిస్ధితేంటో అందరికీ అర్ధమైపోతోంది. కాబట్టి కమలం పార్టీ తరపున రేపటి ఎన్నికల్లో ఎవరు పోటి చేసినా దాదాపు ఇటువంటి పరిస్ధితే పునరావృతమవుతుందనటంలో సందేహం లేదు.

 

సరే బిజెపిలో చేరి పోటిచేసే విషయాన్ని పక్కనపెట్టేస్తే అసలు బిజెపిలో చేరాలని ఎందుకు అనుకుంటున్నారు ? అన్న విషయాన్ని రాధాకృష్ణ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అసలు బిజిపిలో చేరటానికి ఎవరూ సిద్ధంగా ఉన్నట్లు లేదు.  నిజంగానే వైసిపిలో నుండి బిజెపిలో చేరటానికి ఎంపిలు ఎవరైనా రెడీగా ఉండుంటే ఈ పాటికే ఎల్లోమీడియా రచ్చ రచ్చ చేసేసుండేదనటంలో సందేహం లేదు. పార్టీ మారటానికి వైసిపిలో ఎవరూ సిద్ధంగా లేరు కాబట్టే ఎల్లోమీడియా కామ్ గా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపిలో నుండి బయటకు వచ్చే ఎంపిలు చేరేదేదో నేరుగా టిడిపిలోనే చేరిపోవచ్చు కదా ?  టిడిపితో అవగాహన పెట్టుకుంటేనే బిజెపిలో చేరుతామనే హామీలు అడగటం ఎందుకు ?  నేరుగా వైసిపి నుండి టిడిపిలో చేరుతామంటే చంద్రబాబు ఏమన్నా వద్దంటాడా ? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు హామీ ఇవ్వాలంటే చంద్రబాబు కాదంటాడా ? పైగా హామీలివ్వటం చంద్రబాబుకు కొత్త కూడా కాదు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఇచ్చిన హామీలు అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా వేమూరి రాసింది ఏ విధంగా చూసినా నమ్మేట్లుగా లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: