ఓ బాటసారి ... ఇది జీవిత రహదారి ! ఎంత దూరమో ఏది అంతమో ? ఎవరూ ఎరగని దారి ఇది ! ఒకరికి సొంతం కాదు ఇది...! ఎవరికి ఎవరు తోడు అవుతారో ..! ఎప్పుడు ఎందుకు విడిపోతారో అంటూ ఓ పెద్దాయన పాడుకుంటూ '' సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా నాకు తెలిసిన ఓ 4O  ఇయర్స్ బాటసారి గుర్తువచ్చాడు. ఆహా ఏమి వైభోగం... ఏమి బిల్డప్పు.. ఏమి పలుకుబడి అంటూ అంతా నోరెళ్లబెట్టేలా ఆయన వ్యవహారం ఉండేది. అధికారం అనే కుర్చీలో ఉండగా అసలు ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా దర్పం ప్రదర్శించిన ఆ పెద్దాయన ఇప్పుడు కుర్చీ దిగిపోయాక ఎక్కడ ఉండాలో తెలియక తికమక పడిపోతున్నాడు. ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే నీ దేశం పోరా రాజా అన్నట్టుగా తాను పాలించిన రాజ్యంలో బిక్కు బిక్కుమంటూ బతకలేక, పక్క రాజ్యంలోని తన కొంపలో ప్రశాంతంగా ఉండలేక సతమతం అయిపోతున్నాడు. 

 

ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉండగానే దేహంలో రకరకాల ప్రొబ్లెమ్స్. ఎవరికీ చెప్పుకోలేడు, కుదురుగా ఉండలేదు. పోనీ విశ్రాంతి తీసుకుంటాడా అంటే, మనశాంతిగా పుత్ర రత్నానికి పదవి అప్ప చెప్పి రెస్ట్ తీసుకుందామా అంటే ఈ పాడు జీవితానికి అది కూడా లేదు. పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్టుగా ఉంది యవ్వారం. సరేలే ఉన్నన్నాళ్ళు ఆ రాజు మీద పోరాటం చేద్దామంటే ... ఆ రాజు మొండివాడు. కాదు కాదు ... మొండివాడే రాజు అయితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. తమ సేనలతో దండెత్తి ఆ రాజు మీద పోరాటం చేద్దామంటే ... ముందే వీపు చూపించేస్తున్నారు. 

 


అంతేనా 'బాబు' నువ్వు కురు వృద్దుడివి.. ఆ మొండి రాజుతో యుద్ధం చేయలేవు కానీ వెళ్లి విశ్రాంతి తీసుకో .. ! మేము ఆ రాజు దగ్గర శరణు కోరేస్తాం అంటూ ఒక్కొక్కరూ ఆ రాజు పార్టీలోకి దూకేస్తుంటే ఎంత బాధగా ఉంటుందండి. ! అసలు వాట్ ఐయామ్ సే అని చెబ్దామన్న వినేవారు ఏరి ? ఇప్పుడు రాజు మీద దండెత్తేందుకు సైకిల్ రథానికి రిపేర్లు చేద్దామన్నా ..దిగేవారే కానీ ఎక్కేవారు ఎక్కడ ..?  నేను వృధ్దిడిని అయిపోయాను కాబట్టే కదా మీరంతా వెళ్లిపోతున్నారు...? మా పుత్ర రత్నాన్ని అయినా నమ్మండి ... ఇక్కడే ఉండండి అని మొత్తుకుని చెబుతున్నా... అయ్యా బాబోయ్ అంటూ ఆ రాజు పార్టీలోకి జంప్ చేస్తున్నారే ? ఒక్కొక్క నేత ఇలా జారిపోతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలి ? 

 

ఒక వైపు వయస్సు అయిపోతుంది అన్న బెంగ, మరో వైపు తన మాట ఎవరూ లెక్క చేయడం లేదు అనే ఆందోళన, మరో వైపు సొంత అనుచరులే దూరం అవుతుండడం ..! అబ్బబ్బా ఈ వయస్సులో ఆ పెద్దాయనకు ఎన్ని టెన్షన్స్. బ్రిఫ్డ్డ్ మీ అన్నా, వాట్ ఐయామ్ సేయింగ్ అన్నా, వినేవాడు ఎవడు... ఆయనతో ఉండేవాడు ఎవడు. ఇప్పుడు అదే చర్చ అక్కడ జరుగుతోంది. పాపం పెద్దాయనకు మనశాంతి లేకుండా చేస్తున్నారేంటయ్యా ..?  

మరింత సమాచారం తెలుసుకోండి: