రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌పై ఎల్లో మీడియాలో వ‌చ్చిన ఓ క‌థ‌నంపై సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతున్నాయి. మ‌హా సంక్షేమ మాయ పేరుతో వండి వార్చిన క‌థ‌నంలో అంతా అప్ర‌స్తుత రాత‌ల‌కే ప్రాధాన్యం ఇచ్చార‌ని అంటున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు. ప్ర‌భుత్వ ఉద్దేశానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అండంపై వెంట్రుక‌లు పీకే ప‌నిపెట్టుకున్నార‌ని కూడా దుయ్య‌బ‌డుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. అనగనగా ఒక రాజుగారు! వంద మందికి వెయ్యి వరహాలు ఇచ్చి... పండగ చేసుకోమన్నారు. ‘నేను వెయ్యి వరహాలు ఇచ్చాను’ అని గొప్పగా చెప్పుకున్నారు. ప్రజలంతా జేజేలు కొట్టారు. అదే రాజు... కమ్మరులకు వంద, కుమ్మరులకు వంద, క్షురకులకు వందేసి వరహాలు కూడా ఇచ్చానన్నారు. ఆయా వర్గాల వారు ‘మనకు రెండు పండగలు’ అని మురిసిపోయారు.

 

‘రాజా... మాకు ఇస్తామన్న వంద వరహాలు ఇవ్వండి’ అని అడిగారు. ‘‘భలే వారే! వందమందికి వెయ్యి వరహాలు ఇచ్చాను కదా! ఆ వందమందిలో మీరు కూడా ఉన్నారు!’’ అంటూ అసలు విషయం చెప్పేశారు ! అచ్చంగా ఇదే రాజుగారి తెలివిని మన సర్కారు వారు కూడా చూపించారు. ‘సంక్షేమం’లో భారీ కనికట్టు చేశారు. అదెలాగో మీరూ చూడండి!- అంటూ పెద్ద క‌థ‌న‌మే ప్ర‌చురించింది.. ఓ ఎల్లో మీడియా! ఈ క‌థ‌నం మొత్తంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైనా, ఆయ‌న బ‌డ్జెట్‌పై నా దుమ్మెత్తి పోయడ‌మే త‌ప్ప మ‌రో విష‌యం ఎక్క‌డా క‌నిపించ‌లేద‌న్న‌ది విశ్లేష‌కుల భావ‌న‌.

 

ఈ రాజుగారి ఎల్లో క‌థ‌నే తీసుకుంటే.. ఇందులో ప్ర‌త్యేకంగా ఒర‌గ బెట్టిన ప్ర‌జాప్ర‌యోజ‌నం ఏదీ లేదు. కేవ‌లం ప్ర‌భుత్వాన్ని ఆడిపోసుకోవ‌డం త‌ప్ప..‌! ఉదాహ‌ర‌ణ‌కు ఒక ఉద్యోగికి నెల జీతం 50 వేలు అనుకుంటే.. దానిలోనే ఇంటి ఖ‌ర్చుల‌కు 20 వేలు.. ఈఎం ఐల‌కు 13 వేలు.. ఇంటి అద్దె కోసం 5 వేలు, ఇత‌ర ఖ‌ర్చుల కోసం ఓ రెండు వేలు. స్కూల్ /  కాలేజీ ఫీజుల కోసం 10 వేలు ఖ‌ర్చు చేశార‌ని అనుకుందాం. ఈ ఖ‌ర్చుల‌ను బ‌ట్టి.. మొత్తం ఆదాయం ఎంత? అంటే సు నాయాసంగా ఎవ‌రైనా యాభైవేల‌ని చెబుతారు. 

 

ఇక‌, ఇంటి ఖ‌ర్చుల‌కు 20 వేలు ఇవ్వ‌డం అంటే.. దీనిలోనే ఉప్పు ప‌ప్పు, చింత‌పండు, బియ్యం.. గ్యాస్‌.. హార్లిక్స్‌, మందులు, వైద్య ఖ‌ర్చులు (అవ‌స‌ర‌మైతే) అన్నీ ఉం టాయి క‌దా?! ఇంటి ఖ‌ర్చు అంటే ఇవే క‌దా? ఈ విష‌యం సామాన్యుడికి కూడా అర్ధ‌మ‌వుతుంది. కానీ, ఎల్లో మీడియా లుక్కేవేరు. ఇంటి ఖ‌ర్చు అంటే.. ఇంటి రూ.20 వేలు ఇచ్చి.. చింత‌పండు, ప‌ప్పు, బియ్యానికి సెప‌రేట్‌గా ఇవ్వాల‌ని ఎల్లో మీడియా భావిస్తున్న‌ట్టుంది! అదేవిధంగా కాలేజీ /  స్కూల్ ఫీజుల‌కు రూ.10 వేలు అంటే.. దీనికి కూడా అద‌నంగా ఇవ్వాల‌ని అన్న‌ట్టుంది ఈ క‌థ‌నం!  వెర్రి ముదిరింది.. రోక‌లి త‌ల‌కు చుట్ట‌మ‌న్న‌ట్టుగా.. సంక్షేమం పేరిట ..జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.100 కేటాయిస్తే.. దీనిలోనే అన్ని వ‌ర్గాల‌కు కేటాయించార‌ని, ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు ఏదో న‌ష్ట జ‌రిగిపోతోంద‌ని పాచిపోయిన క‌థ‌ను తెర‌మీదికి తెచ్చి ప్ర‌చారం మొద‌లు పెట్టింది. 

 

సంక్షేమం అని పేరులోనే అన్ని వ‌ర్గాల సంక్షేమం ఉంటుంద‌నే క‌నీస ప‌రిజ్ఞానం లేని ఎల్లో రాత‌ల‌కు సోష‌ల్ మీడియా జ‌నంన‌వ్విపోతున్నారు. సంక్షేమం కింద కేటాయించిన మొత్తంలోనే అన్ని సామాజిక వ‌ర్గాల‌కు కేటాయిస్తార‌ని, అదేస‌మ‌యంలో ఆయా సామాజిక వ‌ర్గాల జ‌నాభాను బ‌ట్టి కేటాయింపులు జ‌రుగుతాయ‌నే ఆర్థిక సూత్రాన్ని ఎల్లో మీడియా నేర్చుకుంటే బెట‌ర్ అంటున్నారు. ఏదో పెన్నుంది క‌దా.. పేప‌ర్ ఉంది క‌దా.. అని పూన‌కం ప‌ట్టిన‌ట్టు రాస్తూ పోతే.. పోయేది మీ ప‌రువే సార్‌!! అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: