వాపుని చూసుకుని బలుపు అనుకుని ఎగిరెగిరి పడితే చివరకి వాపే మిగులుతుంది. వాపు వేరు బలుపు వేరు అని తెలుసుకో రామా అంటూ అంటూ ఇప్పుడు ఓ పెద్ద రాజుగారిని హెచ్చరిస్తున్నా... అబ్బే అబ్బే నాది బలుపే అనుకుంటూ, కమలంతో నా ప్రయాణం అనుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆ రాజు గారు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. అసలు టికెట్ ఎలా తెచ్చుకున్నాను ... ఎవరి బలంతో గెలిచాను ఇవన్నీ మరిచిపోయి నా వల్లే మీరు గెలిచారు. నా ఫోటో ఉండబట్టే మీకు ఓట్లు పడ్డాయి  అన్నట్టుగా రాజు గారి యవ్వారం ఉంది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీపై మనసు పారేసుకుని, జానపద గీతాలతో పెద్దాయనకే గేలం వేస్తూ అబ్బో అబ్బో రాజు గారి రాజకీయం మాములుగా లేదు. 

IHG


అసలు పార్టీ గీత అడ్డదిడ్డంగా దాటేస్తున్నావేంటయ్యా అంటూ ఒక షోకాజ్ నోటీసు పంపిస్తే.. అయ్యో నేను తిట్టాను కానీ, అంత సీరియస్ గా తిట్టలేదు ప్రభు, మీరు అనుమతి ఇస్తే మిమ్మల్ని కలిసి నా బాధ, నా బలుపు, నా వాపు అన్నిటి గురించి చెప్పుకుంటాను ప్రభు. కాకపోతే మీరు నేను తిట్టిన తిట్లన్నీ తట్టుకోవాలి మరి. మనం మనం ఫ్రెండ్స్ కదా ! అయినా మన మధ్య ఈ అగ్గి రాజేసింది ఆ విజయసాయుడే కదా ! అంటూ ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ఆ జగనుడి మనసు కరగడం లేదు సరికదా ఉన్న పదవికే ఎసరు పెట్టేలా ఢిల్లీ లో చక్రం తిప్పేస్తున్నాడు అని బోధపడిందేమో తెలియదు కానీ, ఈ జగనుడి నమ్ముకున్నా వెస్ట్ అనుకుని ఆ నరేంద్రుడికే భజన కార్యక్రమం మొదలు పెట్టేసారు ఈ రాజు గారు. 

 

అసలే మన పక్కలో బల్లెం లా ఉంటున్న ఆ చైనా మీద కత్తి యుద్ధం చేస్తున్న ఆ నరేంద్రుడి ని కీర్తిస్తూ చైనాతో యుద్ధం అంటూ వస్తే ఆ యుద్ధంలో ఈ నరేంద్రుడే గెలుస్తాడు .. మనల్ని గెలిపిస్తాడు అంటూ ఓ పాత పాటకి రీమిక్స్ చేసి ‘జయం మనది.. జయం మనది.. జయం మనదిరా.. నవభారత రథసారథి మోదీ సారథ్యంలో ...ఓ పాటను రిలీజ్ చేసి తాను ఎంత వీర వీరవిధేయుడునో చెప్పుంటూ, తన పదవికి ఎటువంటి ఢోకా లేకుండా, అలాగే ఆ బ్యాంకుల తాలూకా వ్యవహారాలు పీకకు చుట్టుకోకుండా మీరే కాపాడాలి అంటూ పాట ద్వారా చెప్పుకుంటూ రాజుగారు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కాదు. గతంలో ఇదే తరహాలో లగడపాటి అనే ఓ చిలుక కాస్త హడావుడి చేస్తూ, ఆంధ్రా ఆక్టోపస్ అంటూ బిరుదు కూడా పెట్టుకుని ఇప్పుడు రాజకీయాల్లో ఉనికే కోల్పోయింది. 

 

IHG

 

ఇప్పడూ ఆయన బాటలో రాజుగారు కూడా రాజకీయ జోస్యం చెప్పుకుంటూ, హడావుడి చేస్తున్న తీరు చేస్తుంటే ఉన్న పార్టీలోనూ ...వెళదామనుకున్న పార్టీలోనూ రెండు పార్టీలకు .. రెండిటికి చెడ్డ రేవడిలా తయారవుతుందేమో అన్నదే మా బాధ. ఎందుకంటే ఈ జగనుడు మామూలు వ్యక్తికాదు గా ఇలాంటి ఎన్నో యవ్వారాలు చక్కబెట్టి... ఎంతోమందిని లైన్ లో పెట్టి వచ్చిన అనుభవం ఉన్నవాడు. ఏదేదో ఊహించుకుని అనవసరంగా రాజుగారి రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాడు అనేగా ఇప్పుడు జానాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: