చేసేదంతా చేసేసి ఎక్కడైనా తగులుకుంటే వెంటనే సామాజికవర్గాలను రంగంలోకి దింపేయటం చంద్రబాబునాయుడుకు బాగా అలవాటైన విద్య. అలవాటులో భాగంగానే ఈసారి కూడా బిసి కార్డు ఉపయోగిద్దామని అనుకున్న చంద్రబాబుకు రివర్సులో గట్టి దెబ్బ తగిలింది. చంద్రబాబు వ్యవహారం చూసిన తర్వాత కూడా అచ్చెన్న కూడా మళ్ళీ అదే కార్డు ఉపయోగించినందుకు తలబొప్పికట్టిందనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే అచ్చెన్న అరెస్టు కాగానే వెంటనే చంద్రబాబు బిసి  సామాజికవర్గం నేతలపై ప్రభుత్వం దాడులని, వేధింపులంటూ సొల్లు కబుర్లు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రూ 150 కోట్ల ఇఎస్ఐ కుంభకోణంలో ఇరుక్కుని అచ్చెన్న అరెస్టయితే  బిసి నేతపై ప్రభుత్వం వేధింపులంటూ చంద్రబాబు చేసిన ప్రకటన మొదట్లోనే బూమరాంగ్ అయ్యింది.

 

బిసిలపై తమకు మాత్రమే విపరీతమైన ప్రేమ ఉన్నట్లు, తమకు మాత్రమే వాళ్ళపై పేటెంట్ రైట్స్ ఉన్నట్లుగా చంద్రబాబు కలరింగ్ ఇచ్చాడు. ఓ రెండు రోజులు బిసిలంటూ చంద్రబాబు గోల చేసిన తర్వత గట్టి సమాధానం ఎదురయ్యేసరికి నోరు మూతపడిపోయింది. అవినీతిలో ఇరుక్కున్న అచ్చెన్న అరెస్టుకు బిసి సామిజికవర్గాలకు ఎటువంటి సంబంధం లేదని బిసి సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు గట్టిగా బదులిచ్చాడు. అచ్చెన్నేమీ బిసిల హక్కుల కోసమో లేకపోతే ప్రయోజనాల కోసమో చేసిన పోరాటంలో అరెస్టు కాలేదన్న విషయాన్ని కేశన గుర్తుచేశాడు. అవినీతిలో అరెస్టయిన అచ్చెన్న బయటపడాలంటే వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో పోరాటం చేయాలే కానీ సామాజికవర్గం నుండి ఎటువంటి సహకారం ఉండదని అదేదో పగలగొట్టినట్లు చెప్పేశాడు.

 

ఆ తర్వాత మరో మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు విషయంలో కూడా డిటో డిటోనే వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  కొల్లు అరెస్టుకాగానే చంద్రబాబు మళ్ళీ బిసి కార్డును వేసేశాడు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరచిపోయిందేమంటే హత్యకు గురైన మోకా భాస్కరరావు కూడా బిసి నేతే అన్న విషయం. సరే కొల్లు, చంద్రబాబు గోల ఇలాగుంటే తాజాగా అచ్చెన్న ఓ లేఖ రాశాడు. బిసి నేతలపై ప్రభుత్వం వేధింపులని, తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, బిసి సామాజికవర్గంపై ప్రభుత్వం దాడులంటూ పెద్ద కలరింగే ఇచ్చాడు. అయితే చంద్రబాబుకు ఇచ్చిన సమాధానాన్నే కేశన ఇపుడు కూడా ఇచ్చాడు.

 

అవినీతి, హత్యా నేరాల్లో ఇరుక్కున్న అచ్చెన్న, కొల్లు వ్యవహారం స్వయంకృతాలే అంటూ కేశన తేల్చి చెప్పేశాడు. కాబట్టి వ్యక్తిగత సమస్యల్లో నుండి బయటపడాలంటే వాళ్ళు సొంతంగానే లేకపోతే పార్టీపరంగానో పోరోటం చేసుకోవాలే కానీ బిసి సామాజికవర్గాన్ని వివాదంలోకి లాగాలనుకుంటే సాధ్యం కాదని చెప్పేశాడు. మరి కేశన తాజా ప్రకటనతో చంద్రబాబు, అచ్చెన్నకు బుద్ధివస్తుందా ? అధికారంలో ఉన్నపుడేమో బిసిల తోకను కట్ చేసేస్తానంటూ చంద్రబాబు ఎన్నిసార్లు హూంకరించాడో అందరు చూసిందే. ఏరోజూ అచ్చెన్న బిసిల ప్రయోజనాల కోసం ప్రయత్నించింది లేదు. మరలాంటపుడు అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత  అవసరం కోసం సామాజికవర్గాలను కలుపుకోవాలంటే కుదురుతుందా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: