అవును సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభంకు ఇప్పటికి జ్ఞానోదయం అయినట్లుంది. ఆచరణ సాధ్యంకాని, అమలు సాధ్యంకాని డిమాండ్ తో ఎంతకాలం ఉద్యమం చేసినా సాధించేదేమీ లేదని  ముద్రగడకు ఇప్పటికైనా అర్ధమవ్వటం సంతోషించాల్సిన విషయమే. కాపులను బిసిల్లోకి చేర్చాలనేది ముద్రగడ ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ ఎప్పటికీ చివరకు ముద్రగడే ముఖ్యమంత్రయినా అమలు చేయలేని డిమాండును నెత్తికెత్తుకున్నాడు. కాపు జాతి కాపు జాతి అంటూ నానా యాగీ చేయటం తప్ప ముద్రగడ సాధించిందేమీ కనబడలేదు. చివరకు కాపులను బిసిల్లో చేరుస్తాననే తప్పుడు హామీ ఇచ్చి కాపుల ఓట్లేయించుకున్న చంద్రబాబునాయుడు కూడా చేతులెత్తేసిన విషయం అందరు చూసిందే.

 

కాపులను బిసిల్లో చేరుస్తు ఒకసారి చంద్రబాబు హామీఇచ్చి కాపులను మాయచేశాడు.  ఓబిసిలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు రెండోసారి డ్రామాలాడుదామని చూశాడు. కానీ వర్కవుట్ కాలేదు. మొన్నటి ఎన్నికల్లో కాపులను బిసిల్లోకి చేర్చాలని, కాపులకు రిజర్వేషన్ వర్తింపచేయాలనే డిమాండ్ ను జగన్మోహన్ రెడ్డి ముందు కూడా కొందరుంచారు. అయితే సమస్య పరిష్కారం తన పరిధిలో లేదని, కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదంటూ జగన్ స్పష్టంగా చెప్పాడు. జగన్ ప్రకటనను నమ్మటం వల్లే కాపుల్లో ఓ సెక్షన్  మొన్నటి ఎన్నికల్లో వైసిపికి మద్దతిచ్చింది. అంటే చంద్రబాబు అబద్ధం చెప్పి ఓట్లేయించుకుంటే జగన్ నిజం చెప్పి ఓట్లేయించుకున్నాడు.

 

ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చాడో వెంటనే  ముద్రగడ తన డిమాండ్ ను మళ్ళీ మొదలుపెట్టాడు. రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన కారణంగానే కాపులు వైసిపికి ఓట్లేశారంటూ ముద్రగడ చెప్పిన మాటలను జగన్ పట్టించుకోలేదు. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్ తీసుకొస్తానని జగన్ ఏరోజూ చెప్పలేదు. అంటే రిజర్వేషన్ల విషయంలో కాపుల ఆలోచనేంటో స్పష్టంగా అందరికీ అర్ధమైపోపోయింది. తమకు రిజర్వేషన్ సాధ్యంకాదని చివరకు కాపులందరికీ తెలిసిపోయింది. అందుకనే ప్రత్యామ్నాయంగా కాపులకు కార్పొరేషన్ అని ఇంకోటని జగన్ నిధులు కేటాయిస్తున్నాడు. దాంతో రిజర్వేషన్ డిమాండ్ నుండి మెజారిటి కాపులు పక్కకు తప్పుకున్నట్లు బహుశా ముద్రగడకు కూడా అర్ధమైపోయుంటుంది.

 

అందుకనే చేసేదిలేక కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. కాకపోతే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్న కారణంగానే తాను ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు సాకును చూపించాడంతే. రాజ్యాంగపరంగా కానీ న్యాయపరంగా కానీ కాపులకు రిజర్వేషన్ అమలు చేయటం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన ఇంతచిన్న విషయం ముద్రగడకు తెలీకుండానే ఉంటుందా ? ఎంఎల్ఏగా మంత్రిగానే కాకుండా ఎంపిగా కూడా చేసిన ముద్రగడకు ఇంతచిన్న విషయాన్ని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఆచరణసాధ్యంకాని డిమాండ్ ను తలకెత్తుకున్నాడంటే హిడెన్ అజెండా ఏదో ఉందనే అర్ధమవుతోంది. జగన్ ముందు తన అజెండా అమల్లోకి వచ్చే అవకాశం లేదని క్లారిటి రావటంతోనే ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: