ఏమైనా రాజు గారు రాజుగారే ! ఎంత గుండె నిబ్బరం మనిషి కాకపోతే జగన్ పార్టీ ని ఓ ఆటాడిత్తన్నాడు. ఇయనతో గెలిసినోళ్లంతా నిమ్మళంగా కూసుంటే ఈయనగారేంటండి ఆళ్ల పార్టీవోళ్లనే ఏడిపించెత్తన్నాడు. కట్టబడి జగన్ ను సూసి మేమంతా ఓట్లేసి గెలిపిత్తే... మీరేం కాదు నా బొమ్మ  ఓట్లేశారు అంటూ  సెప్తు ఇతండవాదం సేత్తన్నాడు . పోన్లే మీ బొమ్మో, ఆ జగన్ బొమ్మో సూసి మీట నోక్కేసాం. అయినా ఇప్పుడు ఏమంత కష్టమొచ్చిందో రాజు గారికి ఆ కమలం పువ్వు వైపు ఆశగా చూస్తున్నారు. పోనీ ఎల్లే ఆయన తిన్నగా ఎల్తాన్నాడా ? ఆ జగన్ పార్టీవోళ్లను తీసుకేల్దామని సూత్తన్నాడో ఏమో గాని, అందరితోనూ చెల్ఫీలు దిగెత్తన్నాడు. మా రాజుగారికి ఎంత గుండె నిబ్బరం ఉండకపోతే ఆ జగన్ పార్టీని పికిచ్చేత్తాను అంటున్నాడు. 

IHG

మా గోదారి గారి పౌరుసం అంటే అసామాసీగా ఉంటాదా ఏంటి ? అందుకే ఆ జగన్ మీద కోపంతో మా ఎమ్మెల్యే తో, అటు పక్క ఎమ్మెల్యే మీద కేసులెట్టాడు. అల్లూ గోదారొల్లు కదా ఆల్లుకూడా కేసెట్టేసారు. సరేలే ఇంతకీ ఆ జగన్ మా రాజు గారిని ఊరికే వదిలేసాడనుకున్నారా ? సాల్లే  సంబరం.. ఊరికే వదిలెత్తే జగన్ ఎందుకవుతాడు ? మారాజు గారి సీటుకే ఎసరెట్టేసాడు. మల్లీ మా నరసాపురం లో ఎలచ్చన్లు ఎడతారని ఒకటే డిస్కర్షన్లు. అవును ఒకేలా రాజు గారి సీటు పీకెత్తే, ఇక్కడ ఎలచ్చన్లు ఎడితే ఈయనగారి పరిత్తీతి ఏంటో తెల్వడం లేదు. 

 


అవును ఇన్ని కబుర్లు సెప్పుకున్నాం కానీ, ఇంతకీ మా రాజు గారి ఏమనుకుంటున్నారో అసలు ఆయన ఉద్దేశం ఏంటో కనుక్కుందాం అంటే ఎక్కడ కనబడం లేదండే. అసలోపాలి యెల్లి యండి రాజు గారు మీరు ఆ జగన్ పార్టీలో ఉంటారా లేదా ? వెళ్తే కమలం పువ్వు పార్టీ లోకి ఎల్తారా ? అసలు మీ ఉద్దేశం ఏంటి ? సూటిగా చెప్పమని అడిగేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈయన యవ్వారాలు రోజు సూసి సూసి, సదివి, సదివి బుర్ర ఈటెక్కిపోతుంది. అందుకే ఓ క్లారిటీ కి వచ్చేద్దామని. ఇంతకీ ఆయన కలిత్తే ఏం అడుగుతాను అనేగా మీ డౌటు ? యాండే రాజు గారూ నరాలు తెగిపోతున్నాయండే బాబ అసలు మీరు ఏం సేద్దామనుకుంటున్నారు ? 

 


ఉంటే మేము ఓట్లేసి గెలిపించిన పార్టీలో ఉండండి .. ఎల్తే ఆ పువ్వు పార్టీలోకి యల్లండి. అంతేగాని ఒకసారి ఏమో జగన్ అంటే నాకు ఇట్టం అంటారు. మరోచారేమో పార్టీలో కి రమ్మని కాళ్లవేళ్ల పడి బతిమిలాడితే వచ్చాను అంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో నేను గెలవలేదు అని ఓ సరి అంటారు. మీ ఎలచ్చన్ల బేనర్లు ఇంకా అక్కడక్కడా ఉన్నాయ్, మా నరసాపురం, పాలకొల్లు, అసంట, బీమారం, ఉండి, తణుకు, తడిపెల్లిగూడెం లో ఉన్నాయండే. సర్లే ఇయన్నీ నాకెందుకంటారా ? మరి నాక్కకపోతే ఎవరిక్కావాలండి. మాది గొడవారేనండోయ్. మీకు ఓటేసినోడినేనండోయ్ ! 

మరింత సమాచారం తెలుసుకోండి: