భారత్ దేశం మీద సొంత జనాల్లో బాగా వ్యతిరేకత పెంచాలన్నది నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయితే తెరవెనుక ఏమి జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా కొద్ది రోజులుగా ఓలి మాత్రం నేపాల్ జనాల్లో భారత్ పై వ్యతిరేకత తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. చైనా ప్రోదల్బంతోనే, డ్రాగన్ దేశం మాయలో ఓలి పడిపోవటం వల్లే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కోట్లాదిమంది హిందువులు పరమపవిత్రంగా పూజించే పురుణ పురుషుడు శ్రీరాముడి జన్మస్ధలంపై ఓలి నోటికొచ్చినట్లు మాట్లాడాడు.

 

రాముడు జన్మించింది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కాదని నేపాల్ లోని అయోధ్యలోనే అని ప్రకటించాడు. శతాబ్దాలుగా భారత్ లోని చరిత్రకారులు, రచయితలు తప్పుడు రచనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించాడు. ఎప్పుడైతే ఓలి ప్రకటన వచ్చిందో వెంటనే రెండు దేశాల ప్రజల్లోను అలజడి మొదలైంది. నిజానికి శ్రీరాముడు పుట్టింది నేపాల్ లోని అయోధ్యలో అన్న విషయం నేపాలీయులు కూడా ఎప్పుడూ చెప్పిన దాఖలాల్లేవు. అందుకనే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యే శ్రీరాముడి జన్మస్ధలంగా ప్రాచుర్యం పొందింది. అలాంటిది హఠాత్తుగా ఓలి ప్రకటనతో హిందువుల్లో సంచలనం మొదలైంది. ఓలి ప్రకటన వల్ల ఏమవుతుందనేది వేరే సంగతి. మొత్తానకంటూ గందరగోళం అయితే మొదలైంది కదా ? అదే ఓలి కూడా కావాల్సిందే.

 

అనవసరమైన విషయాలను కెలకటం ద్వారా భారత్ లో గందరగోళం సృష్టిద్దామని అనుకున్న ఓలికి  సొంతదేశం నేపాల్ లోనే ఓలికి దిమ్మతిరిగే షాక్ కొట్టింది. అందులోను సొంతపార్టీ నేతలు, ప్రత్యపక్ష పార్టీల నేతలతో పాటు జనాలు కూడా ఓలి ప్రకటనపై మండిపడుతున్నారు. అనవసర విషయాలను కెలకవటం వల్ల దేశానికి ఎటువంటి మంచి జరగదని ఓలి గ్రహించాలంటూ పార్టీల నేతలతో పాటు జనాలు కూడా బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముడి జన్మభూమిపై ఓలి చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయంటూ చాలామంది నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రధానమంత్రి స్ధాయికి తగని వ్యాఖ్యలను ఓలి చేస్తున్నాడంటూ మండిపోతున్నారు. ఓలి తన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలను నాశనం చేయాలని చూస్తున్నట్లే ఉందంటూ పార్టీల నేతలు మండిపడుతున్నారు. సొంత జనాలే తనకు ఎదురు తిరుగుతారని ఓలి అస్సలు ఊహించి ఉండడు పాపం.

 

నేపాల్ రాజకీయాల్లో తాజా పరిస్ధితులను చూస్తుంటే ప్రధాని చేసిన వ్యాఖ్యలు రివర్సులో చివరకు ఓలికే గట్టిగా తగిలినట్లే ఉంది. భారత్ ను ఇబ్బంది పెడదామని ప్రయత్నించి చివరకు ఓలీనే చిక్కులో పడిపోయాడు. నేపాల్ లో కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే భారత్ తో సంబంధాల విషయంలో ఓలి ఒంటరైపోయిట్లే అనిపిస్తోంది. భారత్ ను కాదని ఓలి చూపిస్తున్న చైనా మద్దతు వైఖరిపై పార్టీలతో పాటు మామూలు జనాలు కూడా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. తన పద్దతిని మార్చుకోకపోతే చివరకు శ్రీరాముడి దెబ్బకు ఓలి పదవిని కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నట్లుగా ఉంది రాజకీయ పరిణామాలు. చూద్దాం చివరకు ఏమవుతుందో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: