అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి” తెనాలికి ద‌గ్గ‌ర‌లో ఉన్నఅమృతలూరులో జులై 7, 1920లో జన్మించారు. అనేక సుప్రసిద్ధ నవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి బిరుదు పొందారు. దేశీ కవితామండలి ఆధ్వర్యంలో ప్రచురించిన శరత్ చంద్ర ఛటర్జీ నవలలు, దేవదేసు, పరిణీత అనువాదాలకు బొందలపాటి శివరామకృష్ణగారికి దోహదం చేశార‌నే చెప్పాలి.  చివరిదశలో ఉద్యోగం లేక, ధనాభావంవల్ల కొంతమంది ప్రసిద్ధులకు కొన్ని ప్రసిద్ధ రచనలు రాసి పెట్టారు. మాధవపెద్ది గోఖలే సూరిగారిని చిత్రరంగంలో ప్రవేశపెట్టారు.  ప్రముఖ నటుడు యం. ప్రభాకరరెడ్డి, సూరి మిత్రులయినతరువాత అనేక చిత్రాలలో క‌లిసి ప‌ని చేశారు. ప్రభాకరరెడ్డి సూరిగారికి అనేక సందర్భాలలో ఆర్థిక సాయం చేశారు.

 

 సమరేశ్ బసు మహాభారత కథాకల్పన శాంబుడు, విభూతిభూషణ్ బందోపాధ్యాయ  చరిత్రాత్మక రచన పథేర్ పాంచాలి నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”విశ్వవాణి””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే జీవనలీల గ్రంథాన్ని 1959 లో రాసారు.  సూరిగారి అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళ అన్నపేరుతో 1968 లో ప్రచురించారు. ఈ సంకలనానికి సోమనాత మిత్ర అవిస్మరణీయమైన పీఠిక, ఈ అనువాదాలు సుప్రసిద్ధమయినవి. బి.యస్.ఆర్ ఈ పుస్తకానికి సమీక్ష రాస్తూ, “పోస్ట్ మాస్టర్, కాబూలీవాలా అనువాదాలను చదివి చెమ్మగిల్లని వారుండరని వ్యాఖ్యానించారు. నవంబరు 19, 1995 తేదీన సూరి మరణించారు.

 

సూరిగారు రాసిన ప్ర‌ముఖ అనువాదాలు

అనురూపాదేవి రాసిన “మంత్రశక్తి” నాటకానికి అనువాదం 1959
నిరుపమాదేవి రాసిన శ్యామలికి అనువాదం. 1959
తారాశంకర్ బెనర్జీ రాసిన జల్ సాగర్ నవలకి అనువాదం, 1960. దేశీ కవితామండలి ప్రచురణ.
తారాశంకర్ బెనర్జీ నవల ఉత్తరాయణ్ కి అనువాదం. ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. (1962)
నీహార్ రంజన్ గుప్త నవల మాయామృగం, (1962)
ఆప్తమిత్రులు అనువాదం, (1966)
బిమల్ కర్ రాసిన అసమయ్ నవలను సమయం కాని సమయం అన్నశీర్షికతో అనువదించేరు, 1968
శరత్ చంద్ర ఛటర్జీ రాసిన స్వయంసిద్ధ తెలుగులో అత్యుత్తమ అనువాద నవలగా ప్రసిద్ధి చెందింది.
వనఫూల్ నవలకి అనువాదం రాత్రి. (1958)
తారాశంకర్ బందోపాధ్యాయ రాసిన "గణదేవత" నవల.1970
సినిమారంగంలో కృషి
కార్తవరాయని కథ. రోమియో జూలియట్, రాజస్థానచరిత్రల ఆధారంగా రూపొందించినది, (1958).
రమాసుందరికి సంభాషణలు.
వరకట్నం (1962)
మా వదిన (1967)
మాతృ దేవత (1969)
భలే తమ్ముడు (1969)
పచ్చని సంసారం (1970)
విచిత్ర దాంపత్యం (1971)
పండంటి కాపురం, (1972). ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది.
గృహప్రవేశం (1982)
కార్తీకదీపం
పచ్చని సంసారం
ధర్మాత్ముడు
గాంధీ పుట్టిన దేశం
రాధా మై డార్లింగ్


పురస్కారాలు
“కలకతార్ కాఛేఈ” అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
సాహిత్య అకాడమీ అనువాద బహుమతి (1993)

మరింత సమాచారం తెలుసుకోండి: