కేతు విశ్వనాథ రెడ్డి తెలుగు సాహిత్యాన్ని సుసంప‌న్నం చేశారు. విద్యావేత్త‌గా కూడా త‌న సేవ‌లందించారు. కథారచయితగా ప్రసిద్ధుడ‌య్యారు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. జూలై 10, 1939 న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించిన ఆయ‌న పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడిగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.

 


ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో  టార్చ్ బేర‌ర్స్ అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం ఈభూమి  పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాథ‌రెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

 

పురస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూఢిల్లీ),
భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),
తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),
రావిశాస్త్రి అవార్డు,
రితంబరీ అవార్డు, మొదలైనవి.
అధ్యాపకుడుగా
విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.

 

వివిధ పత్రికలలో ప్రచురితమైన  కథలు కొన్ని...
1991 కేతు విస్వనాథరెడ్డి కథలు....... ఆంధ్రజోతి వార పత్రిక.
1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.
1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.
1977 మన ప్రేమకథలు. ఆంధ్ర జోతి మాస పత్రిక.
1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.
1979 ఆరోజులొస్తే... నివేదిత మాస పత్రిక.
1980 పీర్ల సావిడి. స్వాతి మాస పత్రిక.
1991 ఎస్.2 బోగీలు. ఉదయం వార పత్రిక.
1997 ఒక జీవుడి ఆవేదన. ఆదివారం ఆంధ్రభూమి.
2001 కాంక్ష రచన మాస పత్రిక.
2003 అమ్మవారి నవ్వు. ఇండియా టుడే.

మరింత సమాచారం తెలుసుకోండి: