తెలుగు, తమిళ, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు పన్నెండువందల సినిమాలకు సంగీతాన్ని అందించిన గొప్ప మ‌హానుభావుడు ఎమ్మెస్ విశ్వనాథన్. ఆయ‌న  జూన్ 24, 1928  జ‌న్మించారు. చివ‌రి వ‌ర‌కు కూడా సంగీత‌మే ప్రాణంగా బ‌తికారు. చివ‌రి ద‌శ‌లో సినిమాల‌కు దూరంగా ఉన్నా.. సంగీత‌మే ప్రాణంగా భావించారు. 14 జూలై, 2015న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించారు .విశ్వనాథన్ కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్ తాలూకాలో ఎలప్పళి గ్రామంలో సుబ్రమణియణ్, నారాయణి కుట్టి లకు జూన్ 24, 1928 తేదీన జన్మించాడు. మూడేళ్ల వయసులోనే తండ్రి, సుబ్రమణియణ్ చనిపోతే, దక్షిణ కణ్ణనూరులో ఉన్న తాతగారి వద్ద పెరిగాడు. తాతగారు ఆ ఊళ్లో జైలు వార్డెన్. నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకున్నాడు. 

 

 

పదమూడేళ్ల వయసులోనే మూడు గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి అందరి ప్రశంసలు పొందాడు. జైలు డే రోజు ఖైదీలతో "హరిశ్చంద్ర" నాటకం వేయించారు, అందులో లోహితాస్యునిగా విశ్వనాధన్ అదరగొట్టేశాడు. దానితో ఖైదీలందరూ సినిమాలలో ప్రయత్నించు అని ప్రోత్సహించారు.ఎమ్జీఅర్ హీరోగా "జనోవా" అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. ఒకే రోజు నాలుగు పాటలు చేశాడు. అవి సాయంత్రం సుబ్బరామన్ కు వినిపిద్దామని అనుకున్నాడు. కాని ఈలోపే వినకూడదని అనుకున్న వార్త వినాల్సి వచ్చింది, సుబ్బరామన్ చనిపోయారు అని. అప్పటికే సుబ్బరామన్ చేతిలో ఏడు సినిమాల దాకా ఉన్నాయి. వాటిని విశ్వనాధన్ - రామమూర్తిలు కలిసి పూర్తిచేసారు. అప్పటికే సుబ్బరామన్ దేవదాసు సినిమాకి 7 పాటలకు బాణీలు చేశారు. 

 


మిగిలిన రెండు పాటలు "జగమే మాయ బ్రతుకే మాయ", బాలసరస్వతి పాడిన "ఇంత తెలిసియుండి" అను పాటలను కూడా స్వరపరిచారు. ఇలా సుబ్బరామన్ ఒప్పుకున్న తెలుగు, తమిళం చిత్రాలను ఎంతో చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి సంగీత దర్శకత్వం చేశారు. 1965 లో కొన్ని కారణాల రీత్యా ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 30 ఏళ్లు ఇద్దరూ కలుసుకోలేదు. ఆ తర్వాత విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం - 3, తెలుగులో 70) పైగా స్వర సారథ్యం వహించారు. నాలాగ ఎందరో అనే సినిమాకు 1978 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వ‌నాథ‌న్‌కు నంది ఉత్తమ సంగీతదర్శకులుగా సత్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: