ఘంట‌సాల గాత్రానికి ఆయ‌న గానం చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఎన్నోసార్లు ఘంట‌సాల త‌ర‌హాలో పాట‌లుపాడి శ్రోత‌ల‌ను ఆయ‌న అల‌రించారు. ఘంటసాల గళానికి, స్వరానికి అలవాటు పడిన నాటి ప్రేక్ష‌కులు ఆయ‌న‌ నిష్క్రమణ త‌ర్వాత లోటు క‌నిపించింది. అయితే వి.రామకృష్ణ ఆ లోటును చాలా వ‌ర‌కు పూడ్చాడ‌నే చెప్పాలి. అగ్రనాయకులు అక్కినేని, ఎన్టీఆర్‌లకు పాటల పాడే గొంతు ఇక లేదేమో అనుకుంటున్న తరుణంలో అభిమానులకు ప్రత్నామ్నాయం దొరికింది. మరో రెండు దశాబ్దాల పాటు ఆ సంగీత సామ్రాట్టు గళాన్ని మరిపించిన మరో ఘంటసాల, మనం రామకృష్ణగా పిలుచుకున్న విస్సంరాజు రామకృష్ణ దాసు. 

 

రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు 1947, ఆగష్టు 20 న విజయనగరంలో జన్మించాడు. గాయని పి.సుశీల ఈయనకు మేనత్త. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు. రామకృష్ణది సంగీత నేపథ్య కుటుంబం, తాత పులిపాక ముకుందరావు వైణిక విద్వాంసులు. తల్లి రత్నమ్మ సంగీత వాతావరణంలోనే రామకృష్ణను పెంచింది. ఆమె విజయనగరంలో ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద విద్యను అభ్యసించారు. 

 


కుటుంబమంతా సంగీత నిలయం కావడంతో రామకృష్ణకు సహజంగానే స్వరజ్ఞానం ఒంటబట్టింది. వృత్తిరీత్యా తండ్రి గనుల శాఖలో ఉన్నతోద్యోగి కావడంతో రామకృష్ణ బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. 1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్ లో పాటలు పాడి, పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2001లో నువ్వే కావాలి చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు సాయి కిరణ్ వీరి అబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి. క్యాన్సర్ బారిన ప‌డిన రామ‌కృష్ణ  2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.


రామ‌కృష్ణ‌కు మంచి పేరు తెచ్చిన చిత్రాలు ఇవే....

విచిత్రబంధం (1972) : వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట
అందాల రాముడు (1973)
తాత మనవడు (1973) : అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
పల్లెటూరి బావ (1973)
శారద (1973) : శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ
అల్లూరి సీతారామరాజు (1974) : తెలుగువీర లేవరా (ఘంటసాలతో)
గుణవంతుడు (1975)
ముత్యాల ముగ్గు (1975) : ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు
భక్త కన్నప్ప (1976)
మహాకవి క్షేత్రయ్య (1976)
సీతా కళ్యాణం (1976)
చక్రధారి (1977)
అమరదీపం (1977) : నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది
దాన వీర శూర కర్ణ (1977)
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
బావా మరదళ్ల సవాల్ (1988)

మరింత సమాచారం తెలుసుకోండి: