మొన్నటివరకు కాశ్మీర్ స్వయం ప్రతి పత్తి గల రాష్ట్రం. అది భారత దేశం లో ఉన్న 370 ఆర్టికల్ వల్ల అక్కడ భారత ప్రభుత్వ విధానాలు మాత్రం పని చేయవు. డెబ్భై రెండేళ్లుగా ఇలాగె కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆ ఆర్టికల్ రద్దుపై దైర్యం చేయలేదు . కానీ రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సాహసోపేతంగా ఆర్టికల్ 370 ని రద్దు చేసి ఓ  సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత కాశ్మీర్ లో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారుతుంది .


కాగా  ఇన్ని రోజుల వరకు కాశ్మీర్ యువతులు  ఇతర రాష్ట్రాల అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే కాశ్మీర్ సభుత్వం రద్దు అవుతుంది అనే నిబంధన ఉండేది . మనసుకి నచ్చిన వాళ్ళను  పెళ్లి చేసుకునే అదృష్టం లేకుండా ఉన్న అక్కడి యువతులు  ఇప్పుడిప్పుడే స్వేచ్ఛాయువులు  పీల్చుకుంటున్నారు. కాగా ఓ  ప్రేమ జంట ఇప్పుడు పెళ్లి  పీటలు ఎక్కబోతున్నారు. కాశ్మీర్ చెందిన కామిని రాజ్ పుత్ కి రాజస్థాన్ కు చెందిన అక్షయ్ కు పరిచయం ఏర్పడగా...  పరిచయం ప్రేమగా మారింది. కానీ ఆర్టికల్ 370  నిబంధనల  వల్ల  పెద్దలు వీరి  పెళ్ళికి అంగీకరించలేదు. కానీ ఇప్ఫడు 370 ఆర్టికల్ రద్దవ్వడంతో ఈ జంటకు లైన్ క్లియర్ అయింది. కాగా వీళ్ళ  పెళ్ళి మరో రెండు వారాల్లో జరగనుంది. వాళ్ళ పెళ్ళికి ప్రధాన మంత్రి నిర్ణయమే కారణమని మోడీ కి థాంక్స్ చెప్తున్నారు .  కాశ్మీర్ కు చెందిన యువతిని ఇతర రాష్ట్రాల అబ్బాయిలు పెళ్లి చేసుకోవటం ఇదే మొదట సారి.


ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నవ్ కి చెందిన మైక్ దేవ్నాని అనే వ్యక్తి  40 ఏళ్ళ క్రితం ఫిలిప్పీన్స్ లో స్థిరపడ్డాడు .దేశ భక్తితో అక్కడ మదర్ ఇండియా అని ఓకే రెస్టారెంట్ కూడా స్థాపించాడు. కాగా ఆర్టికల్ 370 ,35A ల రద్దు స్వాగతిస్తూ ...తన దేశ భక్తిని వినూత్న రీతిలో చాటుతున్నాడు .తన రెస్టారెంట్ లో బీర్లకి 370,35A అని పేర్లు పెట్టేసాడు . ఎందుకు ఆ పేర్లు పెట్టావ్ అని అతన్ని ఎవరైనా అడిగితే ...ఆ పేర్లు ప్రచారం కోసం కాదు ..నా భారత దేశ గొప్పతనాన్ని చాటి చెబుతున్నాను అని సమాధానం ఇస్తున్నాడట .  



మరింత సమాచారం తెలుసుకోండి: