ఆస్ట్రేలియాలో జరిగిన  ఈ వింత ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పెంపుడు కొడుకో లేదంటే బంధువులో ఆస్తి తగాదాల వలనో  లేదా మరి ఏదైనా కారణాల ద్వారా వ్యక్తులు చంపిన ఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం.  కానీ ఒక కోడి తన యజమాని పై దాడి చేసి మరీ చంపిన ఘటన  ఇప్పుడు అతిపెద్ద సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే


ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా ప్రాంతంలో ఓ వృద్ధ మహిళ నివాసం ఉంటోంది. తన ఇంట్లోనే ఓ కోడిని పెంచుకుంటోంది. రోజు దానికి ఆహారం పెడుతూ ఎంతో బాగా చూసుకునేది. అయితే ఆమె ఒకరోజు కోడి నుంచి గుడ్లు తీసుకున్న సమయంలో ఆ కోడి దాడి చేసింది. కోడి తన పదునైన ముక్కుతో ఆమెను పలుచోట్ల బలంగా పొడవడంతో చాలా సేపటి వరకు రక్తం కారిపోయింది.దాంతో రక్తం ఆగకపోవడంతో ఆమె మరణించింది. ఈ విషయాన్ని  వైద్యులు  ధృవీకరించారు అయితే

ఈ కేసును అధ్యయనం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు బ్రౌసర్ మాట్లాడుతూ పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని , ముఖ్యంగా వృద్ధులు జంతువుల దాడి చేసే సమయంలో తప్పించుకునే శక్తి ఉండదని, అందుకే అలాంటివారు పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే స్థానిక మీడియా ఆ మహిళ పేరు కానీ ఇతర వివరాలు ఏమీ కానీ వెల్లడించలేదు


మరింత సమాచారం తెలుసుకోండి: