జ్ఞానాన్ని   ప్రసాదించే వాడు గురువు ... మన జీవితానికి మార్గదర్శి గురువు ...తప్పొప్పులు సరిదిద్ది సరైన మార్గంలో నడిపే మహోన్నత వ్యక్తి గురువు .అలంటి గురువులను పూజించే గొప్ప సంస్కృతి మన భారతీయులది...డాక్టర్ సర్వేపల్లి రాధ కృష్ణన్ పుట్టిన రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు।టీచర్స్ డే రోజు తమ తమ ఉపాధ్యాయులకు విషెష్ చెప్పటం తప్ప .... ప్రత్యేకంగా సర్వేపల్లి రాధ కృష్ణన్ పుట్టిన రోజు నాడే ఎందుకు ఈఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు అనేది మాత్రం ఈ కాలంలో చాలా మందికి తెలీదు. 


 1882 సెప్టెంబర్ 5న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అయన సొంతూరు నెల్లూరు జిల్లా సర్వేపల్లి కావటం తో  అయన ఉరి పేరే ఆయన పేరు ముందు చేరింది .మద్రాస్ యూనివర్సిటీ, కలకత్తా విశ్వ విద్యాలయం,  బెనారస్ హిందూ యూనివర్సిటీ ,ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లాంటి పలు పేరొందిన యూనివర్సిటీల్లో ఆయన బోధించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప  మావతా వాది...విద్యార్థులకి ఎం కష్టం వచ్చిన సాయం చేయటానికి ముందుండే వారు .ఉపరాష్ట్రపతిగా 10  ఏళ్ళు సేవలందించి తర్వాత రాష్రపతి గా కూడా సేవలందించారు.అయన అందించిన సేవలకు గాను భారత రత్న అవార్డు కూడా దక్కించుకున్నారు   డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక ఉపాద్యాయుడు నుండి  దేశ రాష్ట్రపతిగా  ఎదగటం  ఉపాధ్యాయులకు  వన్నె తెచ్చే విషయం కాబట్టి అయన పుట్టినరోజుని టీచర్స్ డే గా జరుపుతారు 

కాగా ఈ సంకృతి కొత్తగా వచ్చింది కాదు ... భారత దేశంలో గురువులను పూజించటం అనేది పురాతన కాలం నుండి  అనాదిగా వస్తున్న ఆచారం ఇది. రామాయణం, మహా భారతంలో కూడా గురువులను గొప్పగా పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏకలవ్యుడు గురువు  లేకుండా కేవలం ప్రతిమను పెట్టుకుని... విద్యను అభ్యసించాడు. గురువు దగ్గర ఏం నేర్చుకో క పోయినా... కేవలం బొమ్మను గురువు గా భావించి నేర్చుకున్న విద్య కోసం..... ఆ ప్రతిమ లో ఉన్న గురువు అడిగితే ఏకంగా తన బొటన వెలినే కోసిచ్చాడు గురుదక్షిణ గా. మూర్ఖులు సైతం గొప్ప మహామహులు గా , రాజులుగా వర్ధిల్లారు అంటే  అది కేవలం గురువుల చలవ మాత్రమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక మనిషి ఎదుగుదలకు కారణం ... అతడు గొప్ప స్థాయిలో గుర్తింపు, మెప్పు పొందడానికి కారణం కేవలం గురువు వల్లే అనేది జగమెరిగిన సత్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: