దసరా సెలవుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతోంది. ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఈ సీజన్ లో తెలంగాణా ఆర్టీసీ ఖాతాలో పడే సొమ్మును  తమ ఖాతాలో వేసుకోని ఈ పండుగ సమయంలో లాభాల బాట పట్టించనుంది.   ఏపీ సర్కార్ ఏపీఎస్ ఆర్టీసీ విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు తెలంగాణా ఆర్టీసీ కార్మికులను సైతం ఉద్యమ బాట పట్టించింది.

ఈ సమ్మె కారణంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పండుగ సందర్భంగా వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీఎస్ఆర్టీసీ 500 అదనపు సర్వీసులను నడిపించాలని నిర్ణయం తీసుకుంది.ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణా ఆర్టీసీలో సమ్మె కొనసాగుతున్న కారణంగా బెంగళూరు నుంచి 350, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. ఇక శనివారం హైదరాబాద్ నుండి 350 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ అదనంగా 150 బస్సు సర్వీసులను కూడా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని బతికించాలంటే ఏపీ సర్కార్ తరహా ప్రభుత్వ శాఖలో విలీనం చెయ్యాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి సైతం ప్రభుత్వ శాఖలో విలీనం చేసిన ఆర్టీసీని ముందుకు నడిపించటం కత్తిమీద సామే. కానీ కార్మికులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తమ సహకారం అందించటానికి సిద్ధంగా వున్నారు.  ఒకవేళ ఏపీలో సక్సెస్ అయితే అప్పుడు కేసీఆర్ ఆలోచించే అవకాశం వుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందని ఏయూ ప్రకటించింది. ఏపీలో సైతం ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ అధ్యక్షుడు వై వి రావు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు తెలియజేశారు.

ఒకపక్క టి ఎస్ ఆర్ టి సి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతూ తీవ్ర సమస్య ఉత్పన్నం కాకుండా సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తోంది.మరోపక్క ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల పక్షాన నిలిచి ఆందోళనలు చేపడతామని చెబుతోంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో కొనసాగుతున్న సమ్మె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగానూ అనుకూలంగానే మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: