తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజుకూ ప్రాముఖ్యత గాంచింది. మొదట తాను మొక్కలు నాటి ఛాలెంజ్ చేయడంతో మన తెలుగు సినీ హీరో అఖిల్ అక్కినేని, ఎంపి కవిత మొక్కలు నాటారు. దాని తర్వాత అక్కినేని అఖిల్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ అలియాస్ గద్దలకొండ గణేష్ ను నామినేట్ చేయడంతో వరుణ్ బాబు శనివారం మొక్కలు నాటాడు. పని ఒత్తిడి లొ బిజీగా ఉన్నప్పటికీ.. మంచి పని కోసం కాస్త ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనంటూ.. తాను మొక్కలు నాటిన ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు సాయి పల్లవి, తమన్నాలను మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేశాడు మన గణేష్.

తన వంతుగా మొక్కలు నాటిన వరుణ్ తేజ్...గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ బ్యూటీలైన సాయిపల్లవి, తమన్నాలను నామినేట్ చేశారు. వీరిద్దరూ కూడా గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని సూచించాడు. ఇక తనకు ఛాలెంజ్ విసిరిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపాడు మన మెగా ప్రిన్స్ వరుణ్. బదులు గా, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమిత్ర అవార్డ్‌ను సెప్టెంబరు 5న ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ కూడా అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరగనుంది. 

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కేవలం సెలెబ్రెటీల వరకే కాకుండా ప్రతొక్కరు స్వీకరించి కనీసం ఇంటికో మొక్క చొప్పున నాటాలని,, అవార్డును ఆశించి కాకుండా దేశ భవిష్యత్తు దృష్ట్యా ఆశించిన స్థాయిలో మన ఇండియా ని గ్రీన్ ఇండియా చేయాలని ఆశిద్దాం..

"పచ్చని చెట్లు... ప్రగతికి మెట్లు..." అన్న నానుడిని నిజం చేసి చూపిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: